కిరణ్ మనసు ఎటు వెళ్తోందో అతనికే ఇంకా క్లారిటీ లేదు – కానీ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన మరుక్షణమే, అమ్మ మొహంలో ఆత్రుత చూసి ఆ ఆలోచన పక్కన పెట్టేశాడు.
“రా నాన్నా, ఎలా ఉంది జర్నీ?” సరోజ కొడుకుని దగ్గరికి తీసుకుంటూ అడిగింది.”
బాగానే వచ్చాను అమ్మా, ఫ్లైట్ కొంచెం లేట్ అయింది వర్షం వల్ల,” చెప్పాడు కిరణ్.
ఇంటికి వెళ్ళే దారిలో సరోజ ఆగకుండా మాట్లాడుతూనే ఉంది – రేపు సాయంత్రం కలవడానికి ఏర్పాటు గురించి, అమ్మాయి ఫ్యామిలీ గురించి. కిరణ్ మనసులో మాటిమాటికీ వార్సా ఎయిర్‌పోర్ట్ సంభాషణే మెదులుతోంది, కానీ బయటకి తలూపుతూనే ఉన్నాడు.
———–
మర్నాడు సాయంత్రం, ఒక కేఫ్‌లో కిరణ్ ప్రియ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆమె పది నిమిషాలు లేట్‌గా వచ్చింది,
ఫోన్‌లోనే చూస్తూ.”సారీ, హెవీ ట్రాఫిక్,” అంది, కూర్చుంటూ కూడా ఫోన్ కిందపెట్టలేదు. బాగా పరిచయమున్న వ్యక్తిలా మాట్లాడుతుంది.
వెయిటర్ మెనూ ఇవ్వబోతే, ఆమె చేత్తో పక్కకు నెట్టింది. “మెనూ వద్దు, నాకు తెలుసు ఏం ఆర్డర్ చేయాలో. ఐస్డ్ అమెరికానో, ఓట్ మిల్క్‌తో, షుగర్ లేకుండా. మీ దగ్గర ఓట్ మిల్క్ ఉందా? లేకపోతే వేరే చోటికి వెళ్ళాలి మేము.
“వెయిటర్ కొంచెం తడబడుతూ “చెక్ చేసి చెప్తాను మామ్” అనగానే, ప్రియ చిరాకుగా కనుబొమ్మలు ఎగరేసింది.
“ఇలాంటి బేసిక్ విషయాలు కూడా తెలియకపోతే ఎలా,” అని కిరణ్ వైపు తిరిగి,
“సారీ, తినే విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటా.”కిరణ్ కొంచెం ఇబ్బందిగా నవ్వాడు, ఏం చెప్పాలో తెలియక.
“సో, మీ అమ్మ మా అమ్మతో మాట్లాడింది కదా,” ప్రియ మొదలుపెట్టింది, ఫోన్ స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తూనే. “నిజం చెబుతున్న, నాకు ఈ అరేంజ్డ్ మ్యారేజ్ నాటకం మొత్తం చిరాకుగా ఉంటుంది. కానీ మా అమ్మానాన్న ఇద్దరూ ‘ పెళ్లి చేసుకో, సెటిల్ అయిపో’ అని పాడుతూనే ఉంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు సరిగ్గా బతకలేదు, ఇప్పుడు నా లైఫ్ కూడా వాళ్ళ ప్లాన్ ప్రకారం జరగాలంట. నాన్సెన్స్.”
“మీ పేరెంట్స్ గుడ్ అని మా అమ్మ చెప్పింది. నువ్వేమో ఇలా అంటున్నావ్! ఏది నిజం?” కిరణ్ అడిగాడు, కొంచెం ఆశ్చర్యంగా.
“ష్యూర్. సొసైటీ వైజ్ చూస్తే గుడ్. బట్ ఇన్నార్ గా , మా నాన్న బిజినెస్ మూడుసార్లు ఫెయిల్ అయింది, ఇప్పుడు నాకు ‘సెటిల్డ్ లైఫ్’ గురించి లెక్చర్ ఇస్తారు. మా అమ్మేమో తన పెళ్ళి తనకి నచ్చకపోయినా సర్దుకుపోయింది, ఇప్పుడు నన్ను కూడా అదే చేయమంటుంది. నాకు అదంతా వద్దు,” ఫోన్ కిందపెట్టి, మొదటిసారి కిరణ్ కళ్ళలోకి చూసింది. “నేను నా సొంత టర్మ్స్ మీద బతకాలనుకుంటున్నా. మీకు అభ్యంతరం ఉందా అది?”
కిరణ్ ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. “లేదు… అది మంచిదే.”
కాఫీ వచ్చాక, ప్రియ ఒక్క సిప్ తాగి మొహం చిట్లించింది. “ఇది అంత బాలేదు,” అని వెయిటర్‌ని పిలిచి వెనక్కి పంపేసింది,
పెద్దగా వివరణ ఇవ్వకుండా.కిరణ్ మనసులో ఒక పోలిక వచ్చేసింది – అనూష ఫ్లైట్ డిలే గురించి కూడా ఎంత మర్యాదగా, గొణుక్కుంటూనే ఓపిగ్గా ఉంది. ఇక్కడ ప్రియ చిన్న విషయాలకి కూడా ఎంత సులభంగా చిరాకుపడుతోంది.
మీటింగ్ ముగిశాక, ప్రియ లేచి నిలబడుతూ, “నేను చెప్పేది క్లియర్‌గా చెప్తున్నా – నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు. కానీ మా అమ్మానాన్నకి భయపడి ఇక్కడికి వచ్చాను. మీరు కూడా అదే ఫీలవుతున్నారా? చెప్పండి? లాస్ట్ గా ఒక మాట, మీ కళ్ళు చాలా బాగున్నాయి! ఐ లవ్ ఇట్.”
మొదటిలో నిజాయితీగా అడుగుతూ, ఆఖరులో ‘ మీ కళ్ళు బాగున్నాయ్ అనేసరికి కిరణ్ ఆ ప్రశ్నకి ఆశ్చర్యపోయాడు, కానీ నిజాయితీ నచ్చింది. “థాంక్స్, నాకు కూడా కొంచెం అలానే ఉంది.”
“గుడ్. అయితే ఇద్దరం మన పేరెంట్స్‌కి ‘ఆలోచిస్తాం’ అని చెప్దాం, తర్వాత మ్యూచువల్ గా ‘నచ్చలేదు’ అని చెప్పేద్దాం. ఈజీ,” అని కాన్ఫిడెంట్‌గా చెప్పి వెళ్ళిపోయింది.
ఆ రాత్రి కిరణ్ తన గదిలో పడుకుని, ఫోన్ ఓపెన్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో “అనూష” అని సెర్చ్ చేశాడు. వందలాది ప్రొఫైల్స్ వచ్చాయి – వేర్వేరు అనూషలు, వేర్వేరు ఊర్లు, ఏది తనని కలిసిన అనూషదో గుర్తుపట్టడం కష్టంగా ఉంది
అందరి ప్రొఫైల్ ఫోటోలు చిన్నగా ఉండటం వల్ల.కనిపించిన ఐదు ప్రైవేట్ అకౌంట్స్‌ని ఫాలో చేశాడు, ఏదో ఒకటి కరెక్ట్ అయ్యుంటుందని ఆశతో.
మర్నాడు ఉదయం, రెండు ఫాలో బ్యాక్ నోటిఫికేషన్స్ వచ్చాయి. మొదటి అమ్మాయి మెసేజ్ పెట్టింది: “హాయ్! మీరు ఎవరో గుర్తుపట్టలేదు, కానీ ఫాలో చేశారు కాబట్టి హాయ్ చెప్దామని.” ప్రొఫైల్ ఫోటో చూశాడు కిరణ్ – వేరే అమ్మాయి, తను కలిసిన అనూష కాదు. “సారీ, తప్పు అకౌంట్ ఫాలో చేశాను అనుకుంటా,” అని రిప్లై ఇచ్చి అన్‌ఫాలో చేశాడు.రెండో అమ్మాయి కూడా మెసేజ్ పెట్టింది: “Hi, do I know you?” కిరణ్ ఫోటో జూమ్ చేసి చూశాడు – మళ్ళీ వేరే అమ్మాయే. “సారీ, కన్ఫ్యూస్ అయ్యాను,” అని ఆమెని కూడా అన్‌ఫాలో చేశాడు, కొంచెం నిరాశగా.
మిగతా మూడు అకౌంట్స్ నుండి ఏం రెస్పాన్స్ రాలేదు రోజంతా. కిరణ్ “తప్పు అకౌంట్స్ ఫాలో చేశానేమో మొత్తం” అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టేశాడు.
మర్నాడు సాయంత్రం, ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది – “anusha_k accepted your follow request.” ప్రొఫైల్ ఫోటో చూడగానే కిరణ్ మొహంలో నవ్వు వచ్చింది – ఇదే, వార్సా ఎయిర్‌పోర్ట్‌లో కలిసిన అనూషే, ఎట్టకేలకు.
వెంటనే మెసేజ్ పెట్టాడు: “హే! విజయవాడ చేరుకున్నారా అని అడగాలనుకున్నా, కానీ మీ ఇన్‌స్టా వెతకడానికి రెండు రోజులు, ఇద్దరు తప్పు ‘అనూష’లతో కన్ఫ్యూస్ అవ్వడం పట్టింది.
“కొన్ని నిమిషాల్లో రిప్లై వచ్చింది, నవ్వుతూ: “హహ్హా, క్లాసిక్! ఇన్‌స్టాలో ‘అనూష’ అనే పేరుకి కరువు లేదు అస్సలు. ఎంతమందిని కన్ఫ్యూస్ అయ్యారో నన్ను వెతకడానికి?”
“చెప్పను, చెబితే ఎంబ్రాసింగ్ లా ఉంటుంది,” అని టైప్ చేసి నవ్వుకున్నాడు కిరణ్.
“మీ నాన్నగారు ఎలా ఉన్నారు?” అడిగాడు తర్వాత.”కొంచెం స్టేబుల్‌గా ఉన్నారు, థాంక్స్. మీ ఫ్యామిలీ పని ఎలా జరిగింది?”
కిరణ్ ఒక్క క్షణం ఆలోచించి, “జరిగింది. కానీ పెద్దగా ఏం లేదు అనుకుంటా,” అని టైప్ చేశాడు, ప్రియ గురించి పూర్తి వివరాలు చెప్పకుండా.అలా మొదలైంది వాళ్ళ మధ్య మెసేజ్‌ల ఎక్స్‌చేంజ్ .
మొదట్లో అప్పుడప్పుడు, తర్వాత రోజూ.ఒక వారం తర్వాత, సరోజ ప్రియ విషయం అడిగింది. “కిరణ్, ఆలోచించావా? వాళ్ళు రిప్లై కోసం చూస్తున్నారు.”
కిరణ్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు.”అమ్మా… నాకు ప్రియ సరైన మ్యాచ్ అనిపించడం లేదు.”
సరోజ మొహం మారిపోయింది. “ఎందుకు నాన్నా?”
“ఆమె మంచి అమ్మాయే, కానీ మా ఇద్దరి థింకింగ్ వేరు అమ్మా. ఆమెకి ఇప్పుడే సెటిల్ అవ్వాలని లేదు, నాకు కూడా ఆమెతో కనెక్ట్ అవ్వలని లేదు,” చెప్పాడు నిజాయితీగా.
ఇదే మొదటిసారి కిరణ్ అమ్మ మాట కాదనడం. ఆశ్చర్యంతో సరోజ నిట్టూర్చింది. “సరే నాన్నా, ఇంకో సంబంధం చూద్దాం.”కిరణ్ ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు, ఫోన్‌లో అనూష కొత్త మెసేజ్ నోటిఫికేషన్ చూస్తూ.
Leave a Reply