Author: Krishna67

  • Elementor #824

    టీ దుకాణంలో కబుర్లు


    టీ స్టాల్ దగ్గర జరిగే విచిత్రాలు:

    సిగరెట్ కాలుస్తూ హెల్త్ గురించి మాట్లాడతారు,

    లంచం తీసుకుంటూ నిజాయితీ గురించి మాట్లాడతారు,

    ఖాళీగా తిరిగినోడు కలలు గురించి మాట్లాడతాడు,

    పదవి లేనివాడు రాజకీయ సలహాలు ఇస్తాడు,

    పాకెట్ లో పది రూపాయలు లేనివాడు  ఫారిన్ ట్రిప్పులు గురించి మాట్లాడతాడు,

    టీలో షుగర్‌లెస్ అని చెప్పి, కుకీస్ తింటారు,
    ఆడవాళ్ళు ఇక్కడ బిల్లు కట్టరు,

    అన్నిటికంటే హైలైట్ ఇక్కడ అడుక్కునే వాడు అంబానీలా ఫీల్ అయి డబ్బులిచ్చే టీ తాగుతాడు.


    ఈ టీ చేసే మహిమలు:

    ఆఫీసులో సైలెంట్ గా ఇక్కడ సింగర్ లాగా మాట్లాడతాడు.

    మాటలు రాని మూగవాడు మోనో యాక్షన్ చేస్తాడు.

    కళ్ళు లేని గుడ్డివాడు ప్రపంచం గురించి వింటాడు.

    ఈ రెండిటిలో ఏది బాగుందో చెప్పండి:
    1.ఇక్కడ కబుర్లు ఇంటిలో రహస్యాలు నుండి ఏలియన్స్ అండర్ వేర్ వరకు  వినిపిస్తాయి.
    2. ఇంటిలో విషయాలు నుండి ai వరకు అన్ని విషయాలు మాట్లాడారు.

    నాకు తెలిసి ఇది టీ దుకాణం కాదు ప్రతి గ్రామంలో ఉండే మినీ bigboss షో!

  • గాంధీజీ ఎందుకు చేశావు ఇలా?

    మాకోసం బ్రిటిష్ వాడి పాలన నుండి స్వేచ్చగా బ్రతకమని స్వతంత్రం తెచ్చావు. కానీ నీ పుట్టినరోజు నాడు మేము స్వతంత్రంగా మందు కొనుకొని తాగడానికి లేదని బాధపడుతున్నాము! ఐక్యమత్యంగా ఉండాలి అన్నావు.. కానీ మేము “ఐ” బాగుంటే చాలు అనుకుంటున్నాము. అందుకే మా ఐక్యమత్యం పక్కింటి వాడితోనే పిడికెడు మట్టికోసం కొట్టుకోడానికి ఉపయోగిస్తున్నాము. నువ్వు కలలు కన్న దేశం స్వార్థంతో జీవిస్తుంది. ఏమైతే ఏమి! ఈరోజు నీ పుట్టినరోజు.

  • ఇదే నేటి రాజకీయ రచన

    నాయకులను సరిగా అర్ధంచేసుకోలేని ప్రజలు 99.99% ఉన్నారంటే మీరు నమ్మరు! ఎందుకంటే మీకు తెలిసిన నాయకుడు మీకు సేవ చేయడానికి పదవిని స్వీకరిస్తాడని అనుకుంటున్నారు. కానీ 2015 తర్వాత నాయకులు మారిపోయారు. వాళ్ళకి తెలిసిన సేవ సోషల్ మీడియా వరకే! ఇది తెలుసుకుంటే నీకే మంచిది. లేదా నీకర్మ నువ్వే అనుభవించు!

  • మేకప్ ( పై పై మెరుపులు)

    ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెబుతున్న. మీకు ఇదే అనిపిస్తే కామెంట్ చేయండి. లేదంటే ఇది ఇక్కడితో వదిలేసి మీ పనులు మీరు చేసుకోండి.నేను ఒక బుక్ చదివా! అందులో ఉండే హీరో హీరోయిన్ పాత్రల మధ్య సాగే ప్రేమకథ చాలా అద్భుతంగా ఉంటుంది. అది చదివిన ప్రతిసారి ఇలా నా జీవితంలో జరిగితే ఎంత బాగున్ను అని అనుకునేవాడిని.ఇంకాస్త ముందుకు వెళ్ళి ఆ కథలో ఉండే హీరోలాగే నేను ఉంటానికి అలవాటు చేసుకుంటూ వచ్చా! అలాగే నా ప్రవర్తనను మార్చుకున్న.. కానీ వాస్తవంలో  నా ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి.ఎందుకు ఇలా జరిగేదో నాకర్ధమయేది కాదు.. కానీ ఈరోజు అర్థమయింది. మనమంతా పై పై మేకప్లకు స్పందిస్తున్నాము. అందుకే వాస్తవాలు వేరుగా ఉంటున్నాయి.Ai రంగుల ఫొటోలు, సినిమాపై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోల హామీలు, పెద్ద పెద్ద షాపుల్లో పెట్టే లైటింగ్లు, ఓవర్ మేకప్ అయినా అమ్మాయిలు.. ఇలా అన్ని పై పై సొగసులకు లోనవుతున్నాము.

  • Quote of the day: 13^09^2026

    “Weak minds can be more dangerous than strong minds, because strong minds forgive and forget, while weak minds seek revenge.”

    ~ krishna perla

  • లైఫ్ స్టైల్/ సెల్ఫ్ మోటివేషన్

    ఫోటో పిచ్చోళ్ళు ( ఇందులో నువ్వు ఉన్నావు)

    Type your paragraph here

    ఫొటోస్ తీసుకోవడం అనేది మెమోరీస్ లేదా స్టేటస్ చూపడం కాదు.. అది కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం. అంటే నీ హోల్ బాడీ స్ట్రక్చర్ ని  రాయల్ గా చూపించుకోవాడం.

    మరి ఇలాంటిదానిలో నువ్వు చేసే విన్యాసాలు ఎలా ఉంటాయో తెలుసా?
    • నవ్వాలని ఉద్దేశంతో సరిగా బ్రష్ చేయని ఆ పళ్ళు బయటపెట్టేస్తావు.

    • మోకాళ్ళులో శక్తి లేనట్టు వంకరటింకరగా నుంచ్చుంటావు.

    • గుంపులో కలిసిపోవడానికి ఎవరి కాళ్ళ దగ్గరైన కూర్చుండిపోతావు.

    • ఫొటోలు దిగడానికి డ్రెస్ బాగుంటే సరిపోదు, స్ట్రక్చర్ బాగుండాలి. కరెంట్ కొట్టిన కాకిలా బిగుసుకుపోతే ఎలా? ఫ్రీ గా ఉండు.


    ఇందులో నువ్వు చేసిన తప్పుంటే కామెంట్ లో చెప్పు!

  • Mind fcuking money tool

    ” If I ever have nothing better to do, I’ll stay wherever there’s a lot of gambling going on. Because seeing huge amounts of money changing hands right in front of my eyes might bring about some kind of change in me. And with that change, I might make history. That’s why! “
                                                                                                                               ~ krishna perla

    ఒకవేళ నాకు ఎలాంటి పనీపాటా లేకపోతే, ఎక్కడైతే ఎక్కువ గ్యాంబ్లింగ్ జరుగుతుందో అక్కడే నేను ఉంటా. ఎందుకంటే నా కళ్ల ముందు తారుమారయ్యే డబ్బును చూస్తే నాలో ఏదైనా మార్పు రావచ్చు. ఆ మార్పుతో నేను చరిత్ర సృష్టించవచ్చు. అందుకే!
                                                                                                                ~ కృష్ణ పేర్ల

  • దొంగ – దొంగది (ఇది నువ్వు అనుకున్నది కాదు)

    ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. నాకు తెలిసింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పేర్లు, ప్రాంతం వివరాలేవీ బయటపెట్టకుండా చెబుతున్నాను. ఇక విషయానికొద్దాం.

    అది బాగా డబ్బున్న ఒక వ్యక్తి గెస్ట్ హౌస్. రాత్రి 10 గంటల సమయంలో అతడు ఒకామెతో కలిసి అక్కడికి వచ్చాడు.

    ఇద్దరూ శృంగారంలో మునిగిపోయారు. సరిగ్గా అదే సమయంలో ఒక దొంగ ఆ గెస్ట్ హౌస్‌లోకి చొరబడ్డాడు.

    కాసేపటి తర్వాత ఆమె వాష్‌రూమ్‌కి వెళ్ళింది. ఆ వ్యక్తి మంచంపై పడుకొని ఫోన్‌లో ఏవో వీడియోలు చూస్తున్నాడు.

    గది తలుపు లాక్ చేయకపోవడంతో దొంగ లోపలికి దూరి, గన్ గురిపెట్టి అతన్ని బెదిరించాడు. అతని దగ్గరున్న ఫోన్, బంగారం, నగదు, కారు తాళాలు లాక్కున్నాడు.

    ఇంతలో ఆమె వాష్‌రూమ్ నుండి బయటకు వచ్చింది. ఆమెను చూడగానే దొంగ షాక్ అయ్యాడు.

    ఆమె మరెవరో కాదు… స్వయానా ఆ దొంగ భార్య! కానీ ఏమీ మాట్లాడకుండా, మౌనంగా ఆ బంగారం, నగదు, మిగిలినవన్నీ తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు.

    ఇప్పుడు మీకేమనిపిస్తుందో అది కామెంట్ చేయు.

  • AI రచయితగా మారినప్పుడు – వ్యాసం

    Ai రచయితగా మారినప్పుడు ఏముంది ఎక్కడో విన్న కథలు మళ్ళీ చదువుకోవడమే!

    దానికి గతంలో జరిగిందే రాయడమే తెలుసు కానీ ఒక కొత్త కథ సృష్టించడం రాదుగా! అందరూ అనుకుంటారు మనుషులకు ai అసిస్టెంట్ అని.

    కానీ నిజానికి ai కే మనుషులు అసిస్టెంట్. ఎలాంటే ai లేకపోయిన మనుషులు పని చేస్తారు. కానీ మనుషులు లేకుండా ai పని చేయలేదు కదా!

    అయినా ai రచయితగా మారితే నాకేంటి మారకపోతే నాకేంటి. నా పని నాదే! నాకు ఎవరితో లేదు పోటీ.

  • ఆలోచనలు/ thoughts 💬

    నా దృష్టిలో ఇలా అనుకుంటున్న: ఇప్పుడు సమాజంలో మనుషులు 1/4 వంతు స్ట్రెస్ (ఒత్తిడి) ఉంటే 3/4 వంతు ఎంటర్టైన్మెంట్ వెతుకుంటున్నారు.

    ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమవ్వడం లేదు. మీకు తెలిస్తే చెప్పండి?