Manakrishnakathalu

📖 మన కృష్ణ కథలు • ప్రతి కథ నీది నాది • కొత్త భాగాలు ప్రతిరోజూ •

📖 అన్నీ కథలు

  • మేకప్ ( పై పై మెరుపులు)

    ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెబుతున్న. మీకు ఇదే అనిపిస్తే కామెంట్ చేయండి. లేదంటే ఇది ఇక్కడితో వదిలేసి మీ పనులు మీరు చేసుకోండి.నేను ఒక బుక్ చదివా! అందులో ఉండే హీరో హీరోయిన్ పాత్రల మధ్య సాగే ప్రేమకథ చాలా అద్భుతంగా ఉంటుంది. అది చదివిన ప్రతిసారి ఇలా నా జీవితంలో జరిగితే ఎంత బాగున్ను అని అనుకునేవాడిని.ఇంకాస్త ముందుకు వెళ్ళి ఆ కథలో ఉండే హీరోలాగే నేను ఉంటానికి అలవాటు చేసుకుంటూ వచ్చా! అలాగే నా ప్రవర్తనను మార్చుకున్న.. కానీ వాస్తవంలో  నా ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి.ఎందుకు ఇలా జరిగేదో నాకర్ధమయేది కాదు.. కానీ ఈరోజు అర్థమయింది. మనమంతా పై పై మేకప్లకు స్పందిస్తున్నాము. అందుకే వాస్తవాలు వేరుగా ఉంటున్నాయి.Ai రంగుల ఫొటోలు, సినిమాపై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోల హామీలు, పెద్ద పెద్ద షాపుల్లో పెట్టే లైటింగ్లు, ఓవర్ మేకప్ అయినా అమ్మాయిలు.. ఇలా అన్ని పై పై సొగసులకు లోనవుతున్నాము.

  • Quote of the day: 13^09^2026

    “Weak minds can be more dangerous than strong minds, because strong minds forgive and forget, while weak minds seek revenge.”

    ~ krishna perla

  • లైఫ్ స్టైల్/ సెల్ఫ్ మోటివేషన్

    ఫోటో పిచ్చోళ్ళు ( ఇందులో నువ్వు ఉన్నావు)

    Type your paragraph here

    ఫొటోస్ తీసుకోవడం అనేది మెమోరీస్ లేదా స్టేటస్ చూపడం కాదు.. అది కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం. అంటే నీ హోల్ బాడీ స్ట్రక్చర్ ని  రాయల్ గా చూపించుకోవాడం.

    మరి ఇలాంటిదానిలో నువ్వు చేసే విన్యాసాలు ఎలా ఉంటాయో తెలుసా?
    • నవ్వాలని ఉద్దేశంతో సరిగా బ్రష్ చేయని ఆ పళ్ళు బయటపెట్టేస్తావు.

    • మోకాళ్ళులో శక్తి లేనట్టు వంకరటింకరగా నుంచ్చుంటావు.

    • గుంపులో కలిసిపోవడానికి ఎవరి కాళ్ళ దగ్గరైన కూర్చుండిపోతావు.

    • ఫొటోలు దిగడానికి డ్రెస్ బాగుంటే సరిపోదు, స్ట్రక్చర్ బాగుండాలి. కరెంట్ కొట్టిన కాకిలా బిగుసుకుపోతే ఎలా? ఫ్రీ గా ఉండు.


    ఇందులో నువ్వు చేసిన తప్పుంటే కామెంట్ లో చెప్పు!

  • Mind fcuking money tool

    ” If I ever have nothing better to do, I’ll stay wherever there’s a lot of gambling going on. Because seeing huge amounts of money changing hands right in front of my eyes might bring about some kind of change in me. And with that change, I might make history. That’s why! “
                                                                                                                               ~ krishna perla

    ఒకవేళ నాకు ఎలాంటి పనీపాటా లేకపోతే, ఎక్కడైతే ఎక్కువ గ్యాంబ్లింగ్ జరుగుతుందో అక్కడే నేను ఉంటా. ఎందుకంటే నా కళ్ల ముందు తారుమారయ్యే డబ్బును చూస్తే నాలో ఏదైనా మార్పు రావచ్చు. ఆ మార్పుతో నేను చరిత్ర సృష్టించవచ్చు. అందుకే!
                                                                                                                ~ కృష్ణ పేర్ల

  • దొంగ – దొంగది (ఇది నువ్వు అనుకున్నది కాదు)

    ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. నాకు తెలిసింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పేర్లు, ప్రాంతం వివరాలేవీ బయటపెట్టకుండా చెబుతున్నాను. ఇక విషయానికొద్దాం.

    అది బాగా డబ్బున్న ఒక వ్యక్తి గెస్ట్ హౌస్. రాత్రి 10 గంటల సమయంలో అతడు ఒకామెతో కలిసి అక్కడికి వచ్చాడు.

    ఇద్దరూ శృంగారంలో మునిగిపోయారు. సరిగ్గా అదే సమయంలో ఒక దొంగ ఆ గెస్ట్ హౌస్‌లోకి చొరబడ్డాడు.

    కాసేపటి తర్వాత ఆమె వాష్‌రూమ్‌కి వెళ్ళింది. ఆ వ్యక్తి మంచంపై పడుకొని ఫోన్‌లో ఏవో వీడియోలు చూస్తున్నాడు.

    గది తలుపు లాక్ చేయకపోవడంతో దొంగ లోపలికి దూరి, గన్ గురిపెట్టి అతన్ని బెదిరించాడు. అతని దగ్గరున్న ఫోన్, బంగారం, నగదు, కారు తాళాలు లాక్కున్నాడు.

    ఇంతలో ఆమె వాష్‌రూమ్ నుండి బయటకు వచ్చింది. ఆమెను చూడగానే దొంగ షాక్ అయ్యాడు.

    ఆమె మరెవరో కాదు… స్వయానా ఆ దొంగ భార్య! కానీ ఏమీ మాట్లాడకుండా, మౌనంగా ఆ బంగారం, నగదు, మిగిలినవన్నీ తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు.

    ఇప్పుడు మీకేమనిపిస్తుందో అది కామెంట్ చేయు.

  • AI రచయితగా మారినప్పుడు – వ్యాసం

    Ai రచయితగా మారినప్పుడు ఏముంది ఎక్కడో విన్న కథలు మళ్ళీ చదువుకోవడమే!

    దానికి గతంలో జరిగిందే రాయడమే తెలుసు కానీ ఒక కొత్త కథ సృష్టించడం రాదుగా! అందరూ అనుకుంటారు మనుషులకు ai అసిస్టెంట్ అని.

    కానీ నిజానికి ai కే మనుషులు అసిస్టెంట్. ఎలాంటే ai లేకపోయిన మనుషులు పని చేస్తారు. కానీ మనుషులు లేకుండా ai పని చేయలేదు కదా!

    అయినా ai రచయితగా మారితే నాకేంటి మారకపోతే నాకేంటి. నా పని నాదే! నాకు ఎవరితో లేదు పోటీ.

  • ఆలోచనలు/ thoughts 💬

    నా దృష్టిలో ఇలా అనుకుంటున్న: ఇప్పుడు సమాజంలో మనుషులు 1/4 వంతు స్ట్రెస్ (ఒత్తిడి) ఉంటే 3/4 వంతు ఎంటర్టైన్మెంట్ వెతుకుంటున్నారు.

    ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమవ్వడం లేదు. మీకు తెలిస్తే చెప్పండి?

  • ఫాక్ట్స్ (facts)

    పై చిత్రంలో ఇలా ఉంది;

    ఒక సర్వే ప్రకారం 62 శాతం దంపతులు కొంత డబ్బునైనా ఒకరికొకరు సంబంధం లేకుండా వేరుగా ఉంచుకుంటున్నారని తేలింది.”

    ఇది నిజమో కాదో కపుల్స్ మీరే చెప్పాలి?

  • Quote of the day

    ” World is big to visit places but life is short to enjoy Places. “

  • కాలేజీ ప్రేమ – ఐ సి యూ ( పార్ట్ 3)

    24 అవర్స్ ఇంటెన్సివ్ కేర్ లో ఉంచిన తర్వాత..

    ” డాక్టర్! మా స్టూడెంట్ కి ఎట్లా ఉంది? ” శ్రవణ్ కుమార్ సార్ డాక్టర్ని అడిగాడు.

    ” ఇప్పుడు స్టేబుల్‌గా ఉన్నాడు. కానీ కొంతకాలం పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. “

    ” ఏమైంది డాక్టర్? “

    ” మీ వాడికి ఒక హార్ట్ కండిషన్ ఉంది. hypertrophic cardiomyopathy. “” అంటే డాక్టర్?” 

    ” అంటే… మీ వాడికి Hypertrophic Cardiomyopathy ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే, మీ వాడి గుండె కండరం సాధారణం కంటే మందంగా పెరిగింది. దాని వల్ల గుండె పనితీరులో సమస్య ఏర్పడి, హార్ట్‌బీట్ ఒక్కసారిగా అదుపు తప్పింది. దాంతోనే మీ వాడికి స్పృహ తప్పింది.”

    “ఓహ్, డాక్టర్ ఇది పూర్తిగా  తగ్గిపోతుందా? “

    ” పూర్తిగా క్యూర్ చేయడం సాధ్యం కాదు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మెడిసిన్స్, రెగ్యులర్ చెకప్స్‌తో దీన్ని కంట్రోల్‌లో ఉంచొచ్చు. ప్రస్తుతం మీ వాడి కండిషన్ స్టేబుల్‌గా ఉంది. ఇక నుంచి మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. కానీ… మీ వాడికి ఇలా స్పృహ తప్పడం ఇదే మొదటిసారి కాబట్టి, దీన్ని మాత్రం సీరియస్‌గా తీసుకోవాలి.”

    ” అట్లాగే డాక్టర్. థ్యాంక్ యూ “

    డాక్టర్ వెళ్ళిపోయారు. నా కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి.

    “ఇప్పుడేట్లా ఉంది?” అంటూ శ్రవణ్ సార్.

    “బానే ఉంది సార్.”

    “అసలు ఏమైంది?”

    “ఏమో సార్… ఒక్కసారిగా ఊపిరి అందనట్టుగా అనిపించింది. కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అంతే… తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు.”

    “నీకు ఇంకా విషయం తెలియదు అనుకుంటా! నీకొచ్చింది మామూలు కళ్ళు తిరగడం గాదు… Hypertrophic Cardiomyopathy! ఫస్ట్ టైమ్ కాబట్టే పెద్ద ప్రమాదం తప్పింది. ఇకపై జర జాగ్రత్తగా ఉండాలి.”

    “Hypertrophic… హా? అంటే ఏమిటి సార్?”

    “అంటే నీ గుండె కండరం సాధారణం కంటే మందంగా పెరిగిందట. అందుకే ఇక నుంచి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.”

    “అంతేనా సార్?”

    శ్రవణ్ సార్ నా వైపు చూసి కాసేపు ఆగాడు.
    “అంతే కాదు… కొన్ని విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, నేను కాలేజీ కి వెళ్ళాలి. బయట మీ ఫ్యామిలీ, రహీమ్ ఉన్నారు. ఉంటా! ”  అంటూ వెళ్ళిపోయారు.

    సార్ ఏంటి అలా చూసారు? సరేలే… నాకెందుకులే! నన్ను చూడటానికి కాలేజీ మొత్తం వస్తుందని అనుకుంటే, బయట ఎవరు లేరు ఏంటి?

    ఇలా నాలో నేనే ఆలోచించుకుంటునప్పుడు ఐసీయు అద్దంలో చూస్తే శ్రవణ్ సార్ మా ఫ్యామిలీతో ఏదో చెబుతున్నారు. వాళ్ళ మాటల మధ్యలో రహీమ్ మరియు నా చెల్లి లోపలికి వచ్చారు.

    ” మామా రహీమ్! రా, చెల్లి ఫ్రూట్స్ ఏమి తీసుకురాలేదా?”

    ” లేదు రా! ఇప్పటికే చాలా ఖర్చు అయిందని తీసుకురాలేదు. ” అంటూ నా చెల్లి.

    నా చెల్లికి నేనంటే కొంచెం ఎటకారం ఎక్కువ! ఎంతైనా వైజాగ్ లో పెరుగుతుంది కదా! 

    ” పోవే! మామా రహీమ్ రా కూర్చో.”

    ” మామా! అబ్ కైసా హై?  బాగున్నావా? ఫుల్ హుషారుగా కనిపిస్తున్నావ్? “

    ” ఐయామ్ ఒకే! బయట సార్ ఏంటి మా ఫ్యామిలీతో ఏదో చెబుతున్నారు? “

    ” గదే మామా! అబ్ strenuous exercise చేయకూడదని చెబుతుండ్రు! ”

    ” చేస్తే ఏమవుతుందంటా? ”

    ” చేస్తే! తమరు ఇక ఉండరు అంటా! ఈ భూమికి సెలవు చెప్పి, ఆకాశానికి ఎగిరిపోతారంటా! ”  అంటూ వెటకారంగా మా చెల్లి.

    ” నువ్వు నోర్ముయ్! అసలు నువ్వు నాకు చెల్లిగా ఎలా పుట్టావే? “” నాది కూడా సేమ్ ఫీలింగ్.” అంటూ అటు తిరిగింది.” దాని సంగతి వదిలే! మామా నువ్వు చెప్పు! ”

    ” మామా, తను బోలిన కదా! వో పాయింట్ కరెక్ట్ హై. అబ్ నువ్వు స్ట్రాన్యూస్ ఎక్సర్సైజ్ లు  బంద్ చేయాలి. లేదంటే జరా డేంజర్.”

    ” మామా strenuous exerciseలు అంటే ఏంటి? నేనెప్పుడు వినలేదే.”

    ” ముఝే భీ నహీ పతా మామా! బహర్ సార్ బోల్ రహే థే, విన్నా… అబ్ తుమ్ ఫాస్ట్‌గా రన్ చేయకూడదు అట. “

    హీ హి అంటూ నా చెల్లి నవ్వుతుంది.
    ” వీడు వాకింగే చేయడు. అలాంటిది రన్నింగ్. అది కూడా ఫాస్ట్ రన్నింగ్. కామెడీ! ”

    ” నువ్వు కొంచెం సక్కగా ఉంటావా చెల్లి!  రన్నింగ్ అయితే నో ప్రాబ్లం. ఇంతేనా! దీనికే ఇంత సేపు మాట్లాడుతున్నారా? ”

    ” ఇంకా ఉంది మామా! ”

    ” జిమ్ చేయకూడదు, ఈత కొట్టకూడదు, ఫుట్బాల్ ఆడకూడదు ముఖ్యంగా నీకు చాలా చిరాకైన పని ఎత్తైన ప్రదేశాలు ఎక్కకూడదు. “

    ” ఎత్తైనవి అంటే మెట్లు హ? “

    ” కాదు రా! కొండలు రా కొండ గొర్రు! “

    ” ఈ సంగతి పక్కన పెట్టు మామా! ఫ్రెషర్స్ మీట్ ఏమైంది? జరిగిందా? లేదా? “

    రహీమ్ ఇది చెప్పేలోపు ఐసియు డోర్ తీసుకొని మా మమ్మీడాడీ లోపలకి వచ్చారు.

    రాగానే మా మమ్మీ ఒకటే ఏడుపు! మా డాడీ ఆమెను ఓదారుస్తూ! ” ఈరోజు ఈవెనింగ్ డిశ్చార్జ్ అవ్వచ్చు అంటా! అలాగే మీ సార్ నీకు అంతా చెప్పాడంటా కదా! రేపటి నుండి అదే నీ డైలీ రొటీన్. ఇంటిలోనే ఉంటూ మీ మమ్మీ పెట్టింది తిని టాబ్లెట్స్ వేసుకోవాలి! నేను రెండు మూడు రోజులు ఉండకపోవచ్చు. ఆఫీసు పని మీద ముంబై వెళ్లాలి. సరే నా.”

    ” సరే డాడీ! “అంటూ మనసులో ఇలా అనుకున్న: ఒక్క డైలాగ్ తో న్యూస్ టీవీ యాంకర్స్ అందరినీ గుర్తుచేశాడు. ఎనీవే, డాడీ అయితే ఇంటి దగ్గర ఉండరు! మమ్మీ నేను ఎలా చెబితే అలా వింటుంది.  కానీ రేపటి నుండి రోసిని చూడడం కుదరదు! హా ఎన్ని రోజులు రోసిని చూడకుండా ఉండాలి. తన వల్లే నాకిలా జరిగిందని తెలిస్తే, జాలి కలుగుతుంది. అమ్మాయిలకి జాలి కలిగితే ప్రేమించేస్తారు.అంటే తను నన్ను ప్రేమించేస్తుంది.

    ” రేయ్ కన్నా! నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఏడుపు ఆగడం లేదు.. ” అంటూ మా మమ్మీ సౌండ్ చేస్తూ ఏడుస్తుంది.

    ఇంతలో నర్స్ లోపలకి వచ్చి ” ప్లీజ్ పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి. ఎవరో ఒకరు ఇక్కడ ఉండి మిగిలిన అందరూ బయటికి వెళ్ళండి! ” అనేసరికి రహీమ్ ఒక్కడే ఉన్నాడు.

    అబ్బా… రహీమ్ ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు వాడిని అడిగితే ఫ్రెషర్స్ డేలో ఏం జరిగిందో మొత్తం తెలుస్తుంది.




కథల ప్రయాణం

రియాలిటీ, రొమాన్స్, కామెడీ, సస్పెన్స్ మరియు ఫిలాసఫీ కలబోసిన కథల సమాహారం.మన సంస్కృతిని, జీవిత సత్యాలను రేపటి తరానికి పరిచయం చేసే డిజిటల్ వేదిక

Home

Contact Us

Privacy Policy

Disclaimer