కాలేజీ ప్రేమ – మొదటిసారి కలవడం (పార్ట్ 2)

Written by

in

” వావ్ రోసి. నీ హాఫ్ సారీ చానా బాగుంది. నిజంగా చానా అంటే చానా బాగుంది. ”  స్టేజ్ పైకి వస్తూ అంటుంది బేగం.

” థ్యాంక్ యూ బేగం. మై బెస్ట్ ఫ్రెండ్. నీ డ్రెస్ కూడా సూపర్. ”

” థ్యాంక్ యూ రోసి. కానీ ఒక్కమాట, అర్జెంట్ గా వన్ జీరో ఎయిట్ కి కాల్ చేయాల్సిందే. నీ గ్లామర్ చూసి ఎవడైనా దిమ్మ తిరిగి పడిపోతాడు. ఆల్రెడీ ఏడైనా పడిపోయిండేమో. బహుషా! ఎమర్జెన్సీ”

“స్టాప్ ఇట్ బేగం. నిజంగా ఈ హాఫ్ సారీ బాగుందా? ”

” అమ్మాయిని.. ముఝే తో తుమ్హే దేఖ్తే హీ ఏసా ఫీల్ హోతా హై… ఫిర్ లడ్కే క్యాసే సంభాలేంగే? అబ్ నీ డ్రీమ్ బాయ్ తుమ్హే దేఖేగా… గిలగిలా కూట్ జాయేగా! ”” హే ఆపు… నాకు సోప్ వెయ్యక? “” సీరియస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్… సిల్వర్ నెక్లెస్… వాచ్ భీ సూపర్… అండ్ ఫైనల్లీ ఈ శాండల్స్! ఓవరాల్‌గా ఏక్‌దమ్ జబర్దస్త్ ఉన్నావే రోసీ “” థ్యాంక్ యూ మై బెస్ట్ ఫ్రెండ్ బేగం. సెలబ్రేషన్ స్టార్ట్ చేసే టైమ్ అయింది. ఒకే యూ వైట్ దేర్. ” అంటూ, బేగం ఇచ్చిన కాంప్లిమెంట్‌తో వచ్చిన కాన్ఫిడెన్సీతో స్టేజ్ మీదకి వెళ్లింది.

“గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్! హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డిగ్రీ కాలేజ్‌లో జరుగుతున్న ఈ ఫ్రెషర్స్ మీట్ & గ్రేట్ మిలన్‌కి వచ్చిన మన ప్రిన్సిపల్  రవీందర్ సార్ కి, మన లెక్చరర్స్ అందరికీ, అలాగే సీనియర్స్ అండ్ ఫ్రెషర్స్ అందరికీ హార్ట్‌ఫుల్ వెల్కమ్.
కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన ఫ్రెషర్స్‌కి ఇది ఫస్ట్ మెమొరబుల్ డే కాబోతుంది. సో… ఈరోజుని మన జీవితంలో ఒక మెమొరబుల్ డే గా మార్చుకుందాం. Are you ready everyone? ” అని రోసి అంటే  లెక్చరర్స్ తో సహా అందరం ” రెడీ ” అన్నాము. నిబ్బా గాల్లేమో విజిల్స్ వేశారు. మా అరుపులకి తోడుగా డీజే అన్న ఒక సింగిల్ బిజిఎం సౌండ్ వదిలాడు. అది ఇంకా హైలైట్ అయింది.
” Sounds Good, Once again… A very warm welcome to all our freshers!
And this is what we have planned for today…: ( కింద చూపిన ఇమేజ్ లో ఉన్నట్టు చెప్పింది.)”

తను మాట్లాడుతుంటే నేను, రహీమ్ స్టేజ్ ముందు కూర్చొని చూస్తున్నాం. ఆ హాల్ అంతా తన మాటలు వింటోంది. కానీ… నేను మాత్రమే తన పెదాలు కదలికలో సంతోషంగా కనిపిస్తున్న కళ్ళను చూస్తున్న.

“మామా! రోసి యాంకరింగ్ బహుత్ అచ్ఛా! ఫిదా హోగయా! ” అంటూ రహీమ్.

నాకు రహీమ్ మాటలు వినిపించడంలేదు. నిజానికి ఆ హాల్ లో డీజే సౌండ్స్, మిగిలిన మనుషుల గోలలు, ఏమి వినిపించడం లేదు. కేవలం ఫ్యాన్ గాలికి ఎగిరే తన కురులు , ఆ కురులను వెనక్కితోస్తున్న తన చేతివేలు, అప్పుడప్పుడు ఆ చేతివేలుతో  హాఫ్ సారీ కప్పేస్తున్న నడుము. ఇంకా చెప్పాలంటే తను హాఫ్ సారీ కాస్త సర్దుకుంటూ నడుస్తున్నప్పుడు ఆ పట్టీలు చప్పుడు కూడా నాకు క్లియర్ గా వినిపిస్తుంది. బహుశా ఇదేనేమో గాంధీ గారు చెప్పిన ఏకాగ్రత.

మత్తెక్కిన కోతిలాగా ఉన్న నా మొఖం చూసి, నా బుగ్గలు పట్టుకొని . ” మామా! మామా! మామా! ” అంటూ రహీమ్ నన్ను అరుస్తున్నాడు. “

రహీమ్, నాకు రోసి తెగ నచ్చేసింది. నాకు ఆ పిల్ల కావాలి. నువ్వు సైడ్ అవ్వాలి. నాకు హెల్ప్ చేయాలి. నేను రాముడిని, తను సీత, నువ్వు హనుమంతుడివి. మమ్మల్ని నువ్వే కలపాలి. ” అంటూ ఆపకుండా మాట్లాడేస్తున్న.

” చుప్ మామా, బ్రెయిన్ డ్యామేజ్ హోగయా? మే ముస్లిమాన్.  హనుమంత్ నహీ. ”

” సారీ మామా! సారీ. మీరు ప్రేమకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు కదా! నాకు హెల్ప్ చేయు మామా! అలాగే రోసిని  నాకు వదిలే మామా! ”

కాస్త ఆలోచించి “మేరే లియే నిన్న క్యాంటీన్ దగ్గర నువ్వు సైడ్ అయ్యేవ్ కదా! అబ్ నీ కోసం నేను ఎర అవుతా. ఠీక్ హై!” అంటూ చిన్న స్మైల్ ఇచ్చాడు.

” ఓహ్! థ్యాంక్ యూ మామా! థ్యాంక్ యూ! మీ భాషలో ఎలా చెప్పాలి? హా.. గుర్తొచ్చింది. ధన్యవాద్. ధన్యవాద్ రహీమ్ భాయ్. ”

” చల్ రే! డాన్స్ దేఖో! ” అని రహీమ్ నాతో అన్నాడు.

వాడు డాన్స్ చూస్తున్నాడు. నేను రోసిని. సడెన్ గా ఒకసారి తను నన్ను చూసింది. నాకేమి చేయాలో తెలియలేదు. వెంటనే మొఖం తిప్పేసుకున్న! హార్ట్ బీట్ పెరిగినట్టు అనిపించింది. అవును, నా హార్ట్ బీట్ పెరుగుతుంది. నాకు శ్వాస ఆడడంలేదు. తనని చూడాలని మనసు చెబుతున్న తల తిప్పలేకపోతున్నా. కళ్ళు తిరిగిపడిపోయా!

రహీమ్ నేను కిందపడడం చూసి. గట్టిగా అరిచాడు. ఆ అరుపు  నాకు కనిపిస్తుంది. కానీ అది డాన్స్ సపోర్ట్ చేసే అబ్బాయి అమ్మాయిల గోలలో కలిసిపోయినట్టు ఉంది. రహీమ్ తో పాటు నాకు కుడిపక్క కూర్చొన్న అబ్బాయి సాయం చేసి నన్ను లేపుతున్నారు.

ముందు సీటు లో ఉండే శ్రవణ్ కుమార్ సార్ వెంటనే స్టేజ్ పైకి వెళ్ళి రోసి దగ్గర మైక్ తీసుకొని మ్యూజిక్ స్టాప్ అని అనౌన్స్మెంట్ చేశారు. నా చుట్టూ అందరూ గుమ్మిగూడారు.

ప్రిన్సిపాల్ రవీంద్ర సార్ వచ్చి చూసి  “ అందరూ దూరంగా జరగండి… Please, give some space. శ్రవణ్ సార్, మీరు వెంటనే వెళ్లి ambulanceకి call చేయండి. Is there any doctor here? ”

ఎవరో ఒకాయన గబగబ వచ్చి నా గుండె మీద చేతులతో నొక్కుతున్నారు. ఇంకోసారి తన పెదాలతో నాకు ఊపిరి అందించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనినే మెడికల్ లాంగ్వేజ్‌లో CPR అంటారని నాకు తర్వాత తెలిసింది.


అంబులెన్స్‌కి కాల్ చేసినట్టు ఉన్నారు. ఇంతలో శ్రవణ్ సార్ ఇద్దరు సిబ్బందిని తీసుకొచ్చారు.. కానీ నేను ఇంకా స్పృహలోకి రాలేదు. బెడ్ పై ఎత్తి అంబులెన్స్ లోపలకి తీసుకెళ్తున్నారు.

బయట నడుస్తున్న సీన్ వేరు… నా మైండ్ ముందు కనిపిస్తున్న సీన్ వేరు. రోసీ దేవతలా కనిపించి, చేతులు నావైపు చాచి ‘రా’ అంటుంది.‘వస్తున్నా రోసీ…’ అని నేను ఆమె వైపు అడుగు వేస్తుండగానే…

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *