రహస్య కోడలు – తుఫానుకు ముందు (భాగం 18)

Written by

in

📢 “మృత్యువు తొడిగిన పూలదండ” భాగం-23 అప్లోడ్ అయింది. చదవండి!

శనివారం మధ్యాహ్నం, సరోజ సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటోంది. ఫోన్ పక్కన పెట్టేసి, మళ్ళీ తీసుకుంటూ చిరాకు పడుతోంది.

“ఏంటి అత్తయ్యా?” అనూష అడిగింది, రెండు కాఫీ కప్పులు తెచ్చి టేబుల్ మీద పెడుతూ.

“ఏమో మరి, తెలియట్లేదు.” సరోజ ఫోన్ స్క్రీన్ దగ్గరగా చూసింది. “నిమిషానికి ఒకసారి బీప్ బీప్ అంటుంది.”

సరోజ చేతిలోని ఫోన్ స్క్రీన్ వైపు అనూష చూపు పడింది. స్క్రీన్ చూడగానే ఆమె గుండె ఆగినంత పనైంది.

ఫారిన్ కోడ్ ఉన్న నంబర్… అది మారెక్ దేనని వెంటనే అర్థమైంది.”ఏది, నాకు ఒకసారి చూపించు అత్తయ్యా,” అంటూ అనూష కంగారుగా ఫోన్ చేతిలోకి తీసుకుంది.”నాకు తెలుసు ఇందులో ఏముంటుందో…” మనసులో అనుకుంటూనే మెసేజ్ తెరిచింది.

మొదటి ఫోటో — తను క్రాకోలో ఉన్నప్పుడు స్పా యూనిఫారంలో ఉన్నది.

“ఇవి ఎవరు పంపారు?” అంటూ సరోజ లేచి నిలబడింది. ఆత్రుతతో అనూష చేతిలోంచి ఫోన్ లాక్కుంది. రెండో ఫోటో చూసింది, మూడోది… చూపు ఫోన్ మీదే ఉండిపోయింది. ఆఖరులో ఉన్న వీడియో చూసి పెదాలు బిగుసుకున్నాయి.”ఇదేంటి అనూషా? ఇందులో ఉన్నది నువ్వేనా? నీ పక్కన ఉన్న ఆ వ్యక్తి ఎవరు?”

“అత్తయ్యా, సారీ…” అనూష గొంతు పగిలిపోయింది. “నేను చెప్తాను, ప్లీజ్…”

“ఏం చెప్తావ్?” సరోజ గొంతు పెరిగింది. “నా ఫోన్‌కి ఇలాంటివి వస్తున్నాయి! నా కోడలివైన నీ ఫోటోలు ఎవడో పంపుతుండు… ఆ వీడియో చూస్తూనే అర్థమవుతుంది. ఏం చెప్తావ్ నాకు ఇంకా?”

అనూష తలదించుకుంది, ఒళ్ళో , చేతులు వణుకుతున్నాయి.”ఇంతకీ ఎవడు వాడు?”

“క్రాకోలో ఉన్నప్పుడు నాకు తెలియకుండా తీసిన వీడియో అది. ఇదంతా ఆ మారెక్ చేసిన బ్లాక్మెయిల్.”

“తెలియకుండా తీశాడా? చిన్న పిల్లలా మాట్లాడుతున్నావు!” సరోజ ఫోన్ టేబుల్ మీద గట్టిగా పెట్టేసింది. “వాడు ఎవడో ఫోటోలు, వీడియోలు పంపుతుంటే నాకు తెలియకుండా తీశారని బుకాయిస్తున్నావా? పెళ్లికి ముందే వేరే వాడితో…”

అనూష మాట్లాడలేదు, భయంతో ఉంది. సరోజ కూర్చుంది, మళ్ళీ లేచింది, ఒక్కచోట నిలవలేకపోతోంది. “నా కొడుక్కి అప్పుడే చెప్పాను! అంతా పూర్తిగా తెలుసుకున్నావా అని! నా మాట వింటేగా వాడు. నీ తల్లి కష్టపడ్డ పిల్ల అంటే తెలియలేదు. ఒళ్ళు అమ్ముకొని కష్టపడ్డవని!”

“అత్తయ్యా, నేను…”

“నోరుమూయి! నీలాంటి దానిని ఏమి చేయాలో తెలియడం లేదు.” సరోజ చేయి లేపింది, కొట్టకుండా ఆపేసి. “భగవంతుడా, నా కొడుకు జీవితం నాసినమైపోయింది. మా ఇంటి పరువు పోయింది. రేపు వీళ్ళు ఇంకెవరికైనా ఇవి పంపిస్తే… రాధకి, బంధువులకి మేము తల ఎక్కడ పెట్టుకొని తిరగాలి?”

అనూష ఏ సమాధానం చెప్పలేదు, కళ్ళు నుండి కన్నీళ్లు దారులుగా కారుతున్నాయి. సరోజ కిటికీ దగ్గరికి వెళ్ళి, అనూష వైపు వీపు తిప్పి నిలబడింది. రెండు నిమిషాలు గదిలో నిశ్శబ్దం ఆవరించింది.

ఫోన్ మళ్ళీ కంపించింది టేబుల్ మీద. ఇద్దరిలో ఎవరూ తీయలేదు. సరోజ ఫోన్ మోగుతుంది..

స్క్రీన్ పై “కిరణ్ మై సన్ ” అని కనిపిస్తుంది.సరోజ , అనుషాలు ఒకరి ఒకరు చూసుకున్నారు…

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *