శుక్రవారం సాయంత్రం, అనూష బాల్కనీలో బట్టలు తీస్తుండగా ఫోన్ రింగ్ అయింది.మొదటిసారి తీయలేదు, రెండోసారి తీసింది.
“ఏంటి?”
“అనూషా. వినుకో.” మారెక్ గొంతు, తెలుగు మాటలు నెమ్మదిగా, తడబడుతూ వస్తున్నాయి. “వన్ కస్టమర్. ఓల్డ్ వన్. వస్తున్నాడు ఇక్కడకి వారంలో. యూ నో ఆల్రెడీ.”
“అయితే నాకెందుకు అది?”
“యూ. హి వాంట్స్ యూ. అడిగాడు నిన్ను.”అనూష చేతిలో బట్ట పట్టుకుని నిలబడిపోయింది.
“నేను అక్కడ లేను ఇప్పుడు.”
“నో నో. తెలుసు, వస్తే బాగుంటుంది.”
“ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?”
“మనీ గుడ్. హి పేస్ మోర్.” పాజ్. “నువ్వు వస్తే 50: 50..”
“మారెక్ నాకు పెళ్ళైంది. ప్లీజ్ డిలీట్ మై వీడియో.”
“నో ప్రాబ్లం. వన్ టైమ్ మాత్రమే. లాస్ట్ టైమ్. వస్తె ఐ డిలీట్.”
“ఇరిటేట్ చేయకు మారెక్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.”
“వద్దా?” గొంతులో ఏదో మారింది. “ఐ హెల్ప్డ్ యూ దట్ టైమ్. ఆర్ యూ ఫర్‌గాట్?”అనూష ఏం చెప్పలేదు.
“కమింగ్ ఆర్ నాట్?”
“రావట్లేదు.” రెండు క్షణాలు మౌనం.
“సరే.” మారెక్ తెలుగులోనే చెప్పాడు ఈసారి, స్పష్టంగా, ఎవరో నేర్పించినట్టు. “నీ కుటుంబం అంతా తెలుస్తుంది. లెట్స్ వాచ్ మై గేమ్.”
కాల్ కట్ అయ్యింది.అనూష ఫోన్ పట్టుకుని నిలబడింది, బట్టలు వేలాడుతూ మిగిలిపోయాయి.
లోపల నుండి సరోజ పిలిచింది. “టీ తాగుతావా?”
కొంచెం ఆగి అంది: “వస్తున్నా అత్తయ్య.”
కూర్చుంది టేబుల్ దగ్గర. సరోజ కప్పు అందిస్తూ గమనించింది ఆమెని.”ఏమైంది?”
“ఏమీ లేదు అత్తయ్యా.”
“మొహం చూస్తే తెలుస్తోంది ఏదో ఉందని. నాకు చెప్పు! “
అనూష కప్పు పట్టుకుంది గట్టిగా. “అలసటగా ఉంది, అంతే.”
సరోజ ఇంకేం అనలేదు, కానీ చూపు తిప్పుకోలేదు కాసేపు.
రాత్రి పదకొండు దాటాక ఫోన్ మోగింది. మెసేజ్.
తెరవలేదు వెంటనే. మంచం మీద పడుకుని ఉంది ఫోన్ పట్టుకుని.
తెరిచింది.
తనే అది. క్రాకోలో, స్పా సెంటర్ రిసెప్షనిస్ట్ యూనిఫారంలో, రిసెప్షన్ దగ్గర తీసినది.
ఫోటో కింద: “i hav more, think Abt it. Ok.”
Leave a Reply