కోడి కూత కూసిన తర్వాత, సూర్యుడు కంటే ముందుగానే నా కళ్ళు తెరుచుకుంటాయి. లోకం ఇంకా నిద్ర లేవక ముందే నేను మేల్కొంటాను. కొందరిలాగే నేను కూడా లేవగానే ఫోన్ ఓపెన్ చేస్తా.
ఏమైనా మెసేజ్ లు వచ్చాయేమోనని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెయిల్స్… అన్నీ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూస్తా. సాధారణంగా నాకు అంత ముఖ్యమైన మెసేజ్ లు ఏవీ రావు. కానీ, ఎప్పుడో ఒక్కసారి ఒక అనుకోని వ్యక్తి నుండి “గుడ్ మార్నింగ్ స్వీట్ బాయ్” అని ఒక చిన్న మెసేజ్ వస్తుంది.
ఆ ఒక్క మెసేజ్ వచ్చిన రోజంతా నాకు ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది, ఎంతో ఉత్సాహంగా నా పనులు చేసుకుంటాను. లేచిన వెంటనే ఫోన్ చూడడం తప్పని నాకు తెలుసు, కానీ ఆ ఒక్క మెసేజ్ కోసం 365 రోజులు ఇదే నా మొదటి రొటీన్.ఆపై ఫోన్ పక్కనపెడతాను.
నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నా ఇష్టాన్ని గుర్తించి, నా పుట్టినరోజు వేడుకగా నా ప్రాణస్నేహితుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ‘boAt Stone 580’ బ్లూటూత్ స్పీకర్. అందులో ఏ.ఆర్. రెహమాన్ గారి లవ్ సాంగ్స్ ప్లే చేసుకుంటూ కాలకృత్యాలు అన్ని ముగించుకుంటాను.
ఆ తర్వాత, తనకంటే నన్ను ఎంతో ఎక్కువగా ప్రేమించిన నా అర్ధాంగి… నాపై ప్రేమతో నాకు ఇచ్చిన మొదటి బహుమతి అయిన షర్ట్, ప్యాంట్ ను నీట్ గా ఇస్త్రీ చేసుకొని వేసుకుంటాను. ఆ బట్టలు వేసుకుంటే చాలు, ఆమెను హత్తుకున్నట్టే ఉంటుంది.
ప్రేమ గుడ్డిది అంటారు కదా, నన్నడిగితే అది 100% నిజమంటాను!ఇక సోల్పహరంగా మా పెరటిలో పెరిగిన చెట్ల నుండి ఒక కొబ్బరికాయ, రెండు జామకాయలు కోసుకుని తింటాను.
ఆకలి తీరిన తర్వాత, నేను పుట్టినప్పటి నుండి నన్ను ఎంతగానో ఆదరించిన ఈ ఊరి మనుషుల కష్టసుఖాలను తెలుసుకోవడానికి బయలుదేరతాను.
ఊరికి ఎడమవైపున ఒక పెద్ద చింతచెట్టు ఉంది. దాని కింద జ్ఞాపకార్థంగా నాలుగు సిమెంట్ బల్లలు వేశారు. అక్కడ నాకోసం ఒక బల్ల ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. నేను వెళ్ళి ఆ బల్ల మీద కూర్చుంటాను. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆ చెట్టు నుండి ఎన్ని ఆకులు రాలిపోయాయో, మళ్ళీ ఏప్రిల్, మే నెలల్లో తిరిగి ఎన్ని ఆకులు చిగురించాయో ఒక్కొక్కటిగా లెక్కపెడుతూ కూర్చుంటాను.అలా మధ్యాహ్నం వరకు అక్కడే ఆగి, ఆ తర్వాత మా ప్రెసిడెంట్ గారి తోటలోకి వెళ్తాను. అక్కడ బాగా పండిన రెండు బొప్పాయి పండ్లు కోసి, చక్కగా కడిగి, మళ్ళీ అదే బల్ల మీద కూర్చొని తింటాను. ఆ పండ్లే నాకు పంచభక్ష పరమాన్నాలు.
కడుపు నిండుతుంది. చల్లటి గాలికి నిద్ర మహారాజు నన్ను ఆహ్వానిస్తాడు. ఈ ప్రపంచంలో ఎవరూ కనని ఒక అద్భుతమైన, ప్రశాంతమైన లోకంలో విహరిస్తున్నట్టు కలలు కంటూ అలా నిద్రపోతాను.సూర్యాస్తమయం అయ్యే సమయానికి నిద్ర లేచి, మళ్ళీ ఇంటికి చేరుకోవాలని నడక ప్రయాణం మొదలుపెడతాను. కానీ అదేంటో… ఉదయం ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా త్వరగానే వచ్చేస్తాను. కానీ సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు మాత్రం ఎన్నో అడుగులు వేస్తే గానీ ఇల్లు రాదు. ఎంత నడిచినా దూరం తరగనట్టు అనిపిస్తుంది.
ఇది ఎవరైనా శాస్త్రవేత్తలు పరిశోధించి నాకు అంతుచిక్కని ఈ రహస్యాన్ని చెప్పాలి?అయినా, నాకు కనిపెట్టి చెప్పడానికి ఏ శాస్త్రవేత్త ఖాళీగా ఉంటాడు? ఎప్పుడూ వాళ్ళ బుర్రల్లో తిరిగే పెద్ద పెద్ద ప్రశ్నలే గానీ, నాలాంటి వాడి ప్రశ్నలకు సమాధానాలు ఎందుకు వెతుకుతారు? పెళ్లాం పిల్లలను వదిలేసి, ల్యాబ్‌లలో ఒకే చోట ఒకే పనిలో నిమగ్నమైన వాళ్ళను ఈ ప్రపంచం మేధావులు అంటుంది. కానీ, ఎవరికీ ఏ హానీ చేయకుండా, ఎవరికీ బదులు చెప్పనవసరం లేకుండా ఊరి మీద తిరిగే నాలాంటి వాడిని మాత్రం ఈ లోకం ‘పిచ్చోడు’ అంటుంది!
అసలు నిజమైన పిచ్చోళ్ళు ఈ జనాలే అని ఈ లోకానికి ఎప్పుడు తెలుస్తుందో ఏంటో!రోజు ఇలా నాలో నేనే గుసగుసలాడుకుంటూ, నాలోని బాధను ఎవరికీ చెప్పుకోలేక, జనాలని తిట్టుకుంటూ ఒంటరిగా జీవితం గడుపుతున్నాను. నా ఊహల్లో నేను ఎవరి సహాయం లేని ఒక పద్ధతైన, క్లీన్ మనిషిగా బతుకుతున్నాను.”ఓ చదువరీ! విను…
ఇప్పటివరకు ఆ మనిషి చెప్పినవన్నీ కేవలం అతని మనసు సృష్టించుకున్న ఒక అందమైన బూటకం! ఒక తియ్యటి భ్రమ! వాస్తవ ప్రపంచంలో అతను నిజంగానే ఒక పిచ్చోడు. కానీ అతను పుట్టుకతో పిచ్చోడు కాదు… అతన్ని ఈ సమాజమే పిచ్చోణ్ణి చేసింది.అతను ప్రాణంగా నమ్మిన స్నేహితుడు, అతనికన్నా ఎక్కువగా ప్రేమించిందని అనుకున్న అతని భార్య, సొంత అనుకున్న కుటుంబం, చుట్టూ ఉన్న సమాజం… అంతా కలిసి అతన్ని దారుణంగా మోసం చేశారు. అతని నమ్మకంతో ఆడుకున్నారు. అతని జీవితాన్ని ముక్కలు చేసి, వాళ్ళు సంతోషపడ్డారు. ఆ ద్రోహాన్ని, ఆ గుండె కోతను తట్టుకోలేకే అతని బుర్ర పాడైపోయింది.ఈరోజు అతని చేతిలో ఫోన్ లేదు, ఏ ‘స్వీట్ బాయ్’ మెసేజ్ లూ రావు. అతని దగ్గర boAt స్పీకర్ లేదు, ఏ రెహమాన్ పాటలూ ప్లే అవ్వవు. అతని భార్య ఇచ్చిన బట్టలు లేవు, ఆ కొబ్బరి తోటలు అతనివి కావు. కానీ… ఆ చేదు నిజాన్ని భరించే శక్తి ఆ గాయపడిన మనసుకు లేదు. అందుకే, ఆ ద్రోహులందరినీ తన ఊహల్లో ఎంతో ప్రేమిస్తున్నట్టు మార్చేసుకున్నాడు.ఎవరి సహాయం లేకుండా, తన ప్రపంచంలో తనే రాజులా బతుకుతున్నానని భ్రమిస్తూ… ఊరి చివర చింతచెట్టు కింద కూర్చుని రాలే ఆకులను లెక్కపెట్టుకుంటున్నాడు. సమాజం చేసిన గాయానికి రూపమే… ఈ పిచ్చితనం!
ఒకే కంపెనీలో పనిచేసే నలుగురు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి కేరళలో ఒక నాచురల్ ప్లేస్ కి వెళ్తారు. అందులో ఇద్దరు అమ్మాయిలు (రేష్మ, సుష్మ), ఇద్దరు అబ్బాయిలు (హరీష్, నరేష్). అందులో ఇద్దరు లవర్స్ (హరీష్, సుష్మా) ఉన్నారు. మరో ఇద్దరు కొల్లిక్స్. నైట్ కి స్టే చేయడానికి మొదట హోటల్స్ కోసం తిరుగుతారు. కానీ లొకేషన్ చాలా పాపులర్ అవ్వడంతో చాలా హోటల్ ఫ్రీ బుకింగ్స్ తో ముందే బుక్ అయిపోతాయి. చూడటానికి వచ్చిన ప్లేస్ కి 5 km దూరంలో ఒక ఓల్డ్ రిసార్ట్ లో రూమ్ బుక్ చేసుకుంటారు.
నరేష్‌కు సంవత్సరంలో ఒక పున్నమి రోజు హార్మోన్స్ మిస్ బ్యాలెన్స్ అయి చుట్టుప్రక్కల ఎవరు ఉన్న పట్టింపు లేకుండా రేప్ చేయడానికి వెనకాడడు. అది 12 నెలల్లో ఏ పున్నమి అన్నది అతనికి తెలియదు. దానికి మందు లేదు.ఆరోజు రాత్రి నిండు పున్నమి. సరిగా అర్ధరాత్రి 12 గంటలకు మెలుకువ వచ్చింది. బైట ఉరుములతో వర్షం. ఆ వర్షానికి పవర్ లేదు. కుక్కలు అరుపులు… ఆ రాత్రి జరగరానిది ఏదో జరగబోతుందని ప్రకృతి ముందుగానే హెచ్చరిస్తున్నట్టు ఎన్నడు లేని విధంగా భయంకరంగా ఉంది. నరేష్ వికృతమైన చూపుతో చుట్టు చూసాడు.
లవర్స్ ఇద్దరు సెపరేట్ రూంలో ఉండడంతో రేష్మ తన పక్క బెడ్ పై ఉంది. ఆ ఉరుముల మెరుపులో రేష్మ అందం మరింతగా మెరుస్తుంది. లోపల హార్మోన్స్ గోల చేస్తుంటాయి. తనకి ఈ లోపం ముందే ఉందని తెలుసుకున్న నరేష్ కంట్రోల్ చేయడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. బయట జరిగే యుద్ధమైతే ఆపేవాడు కానీ ఇది తనలో జరుగుతున్న యుద్ధం. మెలికలు తిరుగుతూ బట్టలు చింపుకుంటూ ఒక మృగంలా కనిపిస్తున్నాడు.ఉరుముల శబ్దానికి రేష్మకి మెలుకువ వచ్చింది.
నరేష్ చేస్తున్న వికృతి చేష్టలకు భయంతో దగ్గరికి వచ్చి “ఏమైంది నరేష్” అని అడుగుతుంది. అప్పటికే మృగంలా ఉన్న నరేష్ రేష్మ పై దాడి చేశాడు. అలా ఆరోజు జరగరాని జరిగింది. రేష్మ నరేష్ చేసిన దాడికి స్పృహ కోల్పోయింది.గంట సమయం తర్వాత నరేష్ కాస్త కుదటపడ్డాడు. రేష్మ పై తను చేసిన పనికి ఎంతో మదనపడ్డాడు. రేష్మకి మెలుకువ వస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందని భయపడి చిందరవందరగా ఉన్న రూమ్‌ను సర్ది, రేష్మ డ్రెస్ ను మార్చి, ఆ రాత్రి తను ఎలా నిద్రపోయిందో అలా అమర్చాడు.
కోడి కూసే సమయానికి చిన్నగా మెలుకువ వచ్చి వెంటనే ఉలికిపడి లేచింది. చుట్టు చూసింది. అంతా బానే ఉంది. వర్షం కూడా తగ్గింది. నరేష్ తన బెడ్ పై నిద్రపోతున్నాడు. తన ఒంటిపై చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. రాత్రి వేసుకున్న డ్రెస్ కూడా ఇది కాదు. రాత్రి జరిగింది నెమ్మదిగా గుర్తుకువస్తుంది. వెంటనే పక్క బెడ్ పై ఉన్న నరేష్ ను చూసి భయంతో మళ్ళీ వెనక్కి పడింది. ఆమె బెడ్ అటుగా ఉండే టేబుల్ పై ఉండే అలారం డబ్బా కింద పడి శబ్దం చేసింది. ఆ శబ్దానికి నరేష్ లేచాడు. అలాగే హరీష్, సుష్మలు కూడా డోర్ వద్దకు వచ్చి డోర్ కొడుతుంటారు.
నరేష్ ఒక్కసారిగా రేష్మ కాళ్ళ పై పడ్డాడు.
“రేష్మా… నన్ను క్షమించమని అడిగే హక్కు కూడా నాకు లేదు,” అంటూ గొంతు వణికించాడు.
నరేష్ నార్మల్ స్థితిని గమనించిన రేష్మ “ఏం జరిగింది నరేష్? నా ఒంటిపై ఈ గాయాలు ఏంటి? నా బట్టలు కూడా మారాయి ఏంటి?” అంటూ తల పట్టుకొని గట్టిగా ఏడ్చింది.
నరేష్ కళ్ళలో నీళ్ళు చిమ్మిస్తూ.. గొంతు పెద్దది చేస్తూ, ఛాతీ మీద చేత్తో కొట్టుకుంటూ, “చిన్నప్పటి నుండి నాకొక శాపం ఉంది రేష్మా… ఏడాదికి ఒక్కసారి ఈ రాక్షసుడు నాలో లేస్తాడు. ఆరోజు ఏమి జరుగుతుందో! ఎలాంటి దారుణాలకు పాల్పడతానో నాకే తెలియదు. ఎంతోమంది డాక్టర్లు కూడా చేతులెత్తేసారు!” అని ఏడుస్తూనే, చెంపదెబ్బలు వేసుకుంటున్నాడు.
రేష్మకి ఏం నమ్మాలో, ఏం నమ్మకూడదో అర్థం కావట్లేదు. తలలో ఇంకా భయం, నొప్పి, గందరగోళం. నరేష్ మాటలు, ఆ కళ్ళనీళ్ళు, ఆ వణుకుతున్న గొంతు. బైట డోర్ కొడుతున్న శబ్దం మరింత ఒత్తిడి తెచ్చింది.”నిజంగానా…” అని మాత్రమే అనగలిగింది, గొంతు పెగలక.
నరేష్ వెంటనే జేబులోంచి ఫోన్ తీసి, కొన్ని మెడికల్ డాక్యుమెంట్స్ ఫొటోలు చూపించాడు. “చూడు రేష్మా… ఇది నిజం. నేను దాక్కోవట్లేదు. ప్లీజ్… నన్ను నమ్ము,” అన్నాడు.బైట డోర్ శబ్దం ఇంకా పెరిగింది.
రేష్మకి ఆలోచించే సమయం లేకుండా పోయింది. “సరే…” అంది, తనకే తెలియకుండా తలూపుతూ.”థ్యాంక్ యూ రేష్మా,” అంటూ కళ్ళు తుడుచుకున్నాడు.
నరేష్.హరీష్, సుష్మాలు లోపలికి వచ్చారు. “ఏమైంది రేష్మ ఎవరో ఏడిచినట్టు వినిపించింది? ఈ కామెడీ ఫెలో నీతో ఏమైనా మిస్ బిహేవ్ చేసాడా?” అంటూ హరీష్ అడిగాడు.కొన్ని సెకండ్ల తర్వాత “లేదు, ఏదో చిన్న పీడకల” అంది రేష్మ.
“సరే మనం తొందరగా వెళ్లకపోతే వ్యూ మిస్ అయిపోతాము” అంటూ సుష్మా అంది. “సరే” అంటూ నలుగురు అనుకోని తయారు అవ్వడానికి వెళ్ళిపోయారు.
కానీ రేష్మ మనసులో ఇలా ఆలోచించుకుంటుంది — నరేష్ తో తప్పు జరిగింది. నేను గనక నరేష్‌ని పెళ్ళి చేసుకుంటే ఆ తప్పు ఒప్పు అయిపోతుంది కదా! పైగా హరీష్, సుష్మాలు కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అంటూ వ్యూ చూడటానికి తయారు అయింది.రేష్మ, సుష్మాలు రూమ్స్‌లో తయారు అవుతున్నారు.
బైట నరేష్, హరీష్ సిగరెట్ కాలుస్తూ ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ సక్సెస్ అని నవ్వుకుంటున్నారు.ఆ టూర్ ముగిసింది. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు.
రేష్మ తన బెడ్ రూమ్‌లో నిద్రపోయే ముందు నరేష్ ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తుంది. ఒక పోస్ట్ అనుమానించేటట్టు ఉంది. అందులో “మై కిడ్స్” అంటూ పిల్లలను స్విమ్మింగ్ పూల్‌తో ఆడిస్తున్న ఫోటో ఉంది. అది చూసి నరేష్‌కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. హరీష్‌కి కాల్ చేస్తే తనది కూడా స్విచ్ ఆఫ్. సుష్మాను అడిగింది. తనకి తెలియదంది.ఏవేవో ఆలోచనలతో ఆ రాత్రి అంతా నిద్రలేకుండా మరుసటి రోజు ఉదయం ఆఫీసుకి వెళ్ళింది. నరేష్, హరీష్‌లు స్విఫ్ట్ కొట్టి యుకేలో కంపెనీకి షిఫ్ట్ అయినట్టు మేనేజర్ చెప్పాడు.మోసపోయాం అని తెలుసుకున్న రేష్మ, సుష్మాలు,”మనం ఇద్దరం ఒకే తప్పు చేసాం సుష్మ. నమ్మడం. కానీ నువ్వు నమ్మింది ప్రేమని, నేను నమ్మింది క్షమాపణని,” మనసులో అనుకుంది రేష్మ కళ్ళనీళ్ళతో.
ఆరోజు నుండి వాళ్ళ జీవితమంతా అడుగులు రక్తంలా జారాయి.
అలారం మోగింది ఐదున్నరకి. చేతికి తగిలింది కానీ ఆఫ్ చేయడానికి కళ్ళు తెరవాలంటే ఇంకో నిమిషం పట్టింది. నేనుండే సౌతాల్ లో డిసెంబర్ ఉదయం అంటే బయట ఇంకా చీకటే, కిటికీ అద్దం మీద మంచు పొర.లేచి, కళ్ళు నలుపుకుంటూ కిచెన్ లోకి వెళ్ళాను.
బల్జీత్ ఇంకా లేవలేదు అనుకున్నా, కానీ వాడు సోఫా మీద కూర్చుని, ఫోన్ లో ఏదో వీడియో చూస్తున్నాడు. అది కూడా ఇయర్‌ఫోన్స్ లేకుండానే.
“ఇంత తెల్లారకముందే ఏంట్రా మేల్కొన్నావ్?” అన్నాను, కెటిల్ ఆన్ చేస్తూ.
“యార్, లుక్ థిస్!” అని ఫోన్ నా వైపు తిప్పాడు. ఎవరో ఇద్దరు నేల మీద దొర్లుతూ, ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకుంటున్న వీడియో.
“ఏంటి ఇద్దరు కౌగిలించుకొని దొర్లుతున్నారా?”
“నో నో, ఇది BJJ! నిన్న మొదటి క్లాస్ కి వెళ్ళిన నేను!” అని లేచి, సోఫా పక్కనే ఏదో పొజిషన్ చేసి చూపించాడు, కాళ్ళు గాల్లో లేపి. “చూడు, ఇది ‘guard’ అంటారు!”
“గార్డా? దేనికి గార్డు? ఇల్లు కాపలా కాయడానికా? నాకేమి సెక్యూరిటీ గార్డ్ అవసరం లేదు.” టీ కప్పు లో పోసుకుంటూ అన్నాను.
“నో , నో! ఫైటింగ్ బ్రో! నువ్వు కూడా రా రేపు క్లాస్ కి!”
“నాకెందుకు బ్రో అది. నేను రెండు జాబ్‌లు చేస్తున్న, నిద్రే సరిగ్గా లేదు, ఇంకా ఫైటింగ్ నేర్చుకోవడం ఏంటి.” టీ ఒక్క గుక్క తాగి, గడియారం చూసుకున్నాను – షిఫ్ట్ కి బయలుదేరాలి.
“లేదు లేదు, ఇది గుడ్! Self-defense! చూడు, ఎవరైనా పట్టుకుంటే, ఇలా…” అని లేచి నా చెయ్యి పట్టుకుని ఏదో ట్విస్ట్ చేయబోయాడు.
“బ్రో, చెయ్యి వదులు ముందు! టీ ఒలికిపోతుంది!” అని విడిపించుకున్నాను. “ఏంటి, మా ఊళ్ళో కుస్తీ లాంటిదా ఇది?” అన్నాను.
“ఎస్, ఎస్! కుస్తీనే! కానీ నేల మీద ఎక్కువ, పైన తక్కువ.”
” ఇలా నేల మీద దొర్లడానికి నెలకి డబ్బు కడతారా? ఎంత?”
“నెలకి యాభై పౌండ్స్ .”
నేను ఆగిపోయాను. “యాభై పౌండ్సా? ఆ డబ్బుతో నేను వారం మొత్తానికి గ్రోసరీ తెచ్చుకోవచ్చు బ్రో. దొర్లడానికి యాభై పౌండ్లు దండగ. ఇది మరి టుమచ్.”
“బ్రో, ఇది investment! Life కి పనికొస్తుంది! మన లైఫ్ పై ఇన్వెస్ట్మెంట్ స్పెండింగ్ అవ్వదు, ఎస్సెట్ అవుతుంది.”
“నా లైఫ్ కి ఇప్పుడు కావాల్సింది నిద్ర, డబ్బు.. దొర్లుడు కాదు.” జాకెట్ వేసుకుని, బ్యాగ్ భుజాన వేసుకున్నాను. బల్జీత్ ఇంకా సోఫా మీద ఏదో పొజిషన్ practice చేస్తూనే ఉన్నాడు, నేను తలుపు వేసుకుని బయటికి వచ్చేసరికి.
సౌతాల్ బ్రాడ్‌వే మీద ఆ చిన్న కేఫ్ షట్టర్ ఎత్తేసరికి ఇంకా ఆరు కూడా కాలేదు. చలికి వేళ్ళు కొంచెం మొద్దుబారినట్టు అనిపించినా, రోజూ చేసే పనే కదా అని షట్టర్ లాక్ తీసి, లోపలికి దూరాను.కాఫీ మెషీన్ ఆన్ చేసి, బీన్స్ నింపుతూ, కార్నర్‌లో ఉన్న చిన్న TV ఆన్ చేశాను. అలవాటు అంతే – ఏం వస్తుందో కూడా పట్టించుకోను, కేఫ్ లో ఏదో మూవ్‌మెంట్ ఉండాలి, అంతే. మిల్క్ జగ్‌లు సర్దుతూ, కుర్చీలు దించుతూ ఉన్నాను, TV వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
“…breaking news this morning…” స్క్రీన్ మీద ఎర్ర బార్ మెరిసింది. నేను పట్టించుకోలేదు, రోజూ ఏదో ఒక “breaking news” ఉంటుంది కదా.”…a young Indian national, working at a supermarket in Manchester, was found dead…””Indian” అనే మాట చెవిన పడగానే, చేతిలో ఉన్న మిల్క్ జగ్ ఆగిపోయింది.
ఏదో రిఫ్లెక్స్ లా తలతిప్పి TV వైపు చూశాను.స్క్రీన్ మీద ఫోటో.అదే మొహం. హీత్రో దిగినప్పుడు, ఇమిగ్రేషన్ క్యూలో నా పక్కన నిలబడి, “మొదటిసారి వస్తున్నావా బ్రో?” అని నవ్వుతూ అడిగిన మొహం అదే.పేరు కూడా సరిగ్గా గుర్తులేదు నాకు.
ఫ్లైట్‌లో మూడు గంటలు మాట్లాడాం అంతే. “Named locally as Arjun” అని స్క్రీన్ కింద స్క్రోల్ అవుతున్న అక్షరాలే నాకు ఆ పేరు గుర్తు చేసినట్టు అనిపించింది – నాకే గుర్తులేని పేరు, ఇప్పుడు లక్షలమంది టీవీల్లో చూస్తున్నారు.మొహం మాత్రం ఖచ్చితంగా గుర్తుంది నాకు – ప్రతి రాత్రి కూడా.
చేతిలో మిల్క్ జగ్ నుండి పాలు కౌంటర్ మీద ఒలికిపోతున్నాయని నాకు రెండు నిమిషాల తర్వాత గానీ తెలియలేదు.
రాత్రి పదకొండున్నరకి గ్యాస్ స్టేషన్ షిఫ్ట్ కి బయలుదేరే ముందు, ఫోన్ తీసి చూశాను.గ్రూప్ చాట్ లో ఎవరో ఆ న్యూస్ ఆర్టికల్ లింక్ షేర్ చేశారు, ఫోటోతో సహా. మళ్ళీ ఆ మొహం.ఉన్నట్టుండి, కిచెన్ లో టీ కాసుకుంటున్న బల్జీత్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను.”ఏయ్… ఆ BJJ క్లాస్ రేపు ఎప్పుడు?
“బల్జీత్ టీ కప్పు దించి, కళ్ళు చిట్లించి చూశాడు.
“నువ్వేనా ఇది అడుగుతుంది? ఉదయమే ‘దొర్లుడు దండగ’ అన్నావు కదా?”
“ప్లాన్ మారింది.”
“యాభై పౌండ్స్ సంగతి?”
నేను ఒక్క క్షణం ఆగాను. “…వీక్లీ డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా?
“బల్జీత్ నవ్వు ఆపుకోలేక పోయాడు. “చావు భయం కూడా నీ jipri (పిసినారి) తనాన్ని మార్చలేదు బ్రో!”
జిమ్ పేరు “సౌతాల్ ఫైట్ అకాడమీ” యూక్స్‌బ్రిడ్జ్ రోడ్ మీద ఒక పాత వేర్‌హౌస్‌లా ఉండే బిల్డింగ్. లోపలికి అడుగుపెట్టగానే చెమట వాసన, mats మీద కొందరు ఇప్పటికే వార్మప్ చేస్తున్నారు.
“రిలాక్స్ బ్రో, మొదటి రోజే కదా, ఎవరూ నిన్ను చంపరు” అని బల్జీత్ నవ్వుతూ అన్నాడు, నా మొహం చూసి.
“చావు కాదు నా భయం, ఈ యాభై పౌండ్ల వేస్ట్ అవుతుందేమో అని.”
కోచ్ – ఒక పొడుగు, బాల్డ్ తలకాయ ఉన్న తెల్లతను. అందర్నీ mat మీద కూర్చోబెట్టి బేసిక్స్ చెప్పడం మొదలుపెట్టాడు. “Today we start with the basic guard position…”అర్థమైంది అర్థంకాలేదు అన్నట్టు తలూపుతూ, బల్జీత్ ఎలా చేస్తున్నాడో చూసి అలానే చేయడానికి ప్రయత్నించాను.
మొదటి “roll” (అంటే పార్టనర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ అన్నమాట) లో నాకంటే చిన్నగా ఉన్న ఒక అమ్మాయి నన్ను పది సెకన్లలో నేల మీద పడేసి, చెయ్యి పట్టేసింది.”టాప్!” అని కోచ్ అరిచాడు, అంటే ఆమె గెలిచిందని అర్థం. నాకు అర్థమైంది ఒక్కటే. నా చెయ్యి నొప్పిగా ఉంది.
“బ్రో? ఇది కుస్తీ లాంటిది కాదు. టెక్నిక్ ముఖ్యం, స్ట్రెంగ్త్ కాదు” అని బల్జీత్ పక్క నుండి ఓదార్చాడు, నవ్వు ఆపుకుంటూనే.
“యాభై పౌండ్లు కట్టి ఇలా చావు దెబ్బలు తినాలా నేను” అని నేను mat మీద నుండి లేస్తూ గొణుక్కున్నాను.కానీ లేస్తూనే, ఆ అమ్మాయి నన్ను పట్టిన పట్టు ఎలా పనిచేసిందో గుర్తుచేసుకున్నాను.
చెయ్యి కదల్చలేనంత సులభంగా. ఒక క్షణం, గ్యాస్ స్టేషన్ కౌంటర్ వెనుక ఒంటరిగా నిలబడిన నా మొహం గుర్తొచ్చింది. ఎవరైనా అలా పట్టుకుంటే…క్లాస్ అయిపోయే సరికి, ఒళ్ళంతా నొప్పులు, కానీ లోపల ఏదో చిన్న confidence మొదలైనట్టు అనిపించింది. “వచ్చే వారం కూడా వస్తా” అన్నాను, బల్జీత్ తో బయటికి నడుస్తూ.
“చూశావా? ఇన్వెస్ట్మెంట్ అన్నానా నేను?”
“ఇన్వెస్ట్మెంటో ఏమో, కానీ ఈ నొప్పులకి పైన్ కిల్లర్ రాయాలి.”
మూడు వారాలు గడిచాయి.ఒళ్ళు నొప్పులు కొంచెం తగ్గాయి, కానీ ఆ అమ్మాయి చేతిలో ఓడిపోయిన సంగతి మర్చిపోలేదు నేను. ప్రతి క్లాస్‌కి వెళ్ళినప్పుడల్లా, ఏదో ఒక కొత్త trick నేర్చుకుని, ఆ రాత్రి షిఫ్ట్‌లో అదే గుర్తుపెట్టుకుని practice చేసుకునేవాడిని. కౌంటర్ వెనుక ఖాళీగా ఉన్నప్పుడు, గాల్లో చేతులు తిప్పుతూ.గ్యాస్ స్టేషన్ లో నా routine కూడా మెల్లగా మారిపోయింది.
మొదటిది- కౌంటర్ కింద ఒక పాత సెల్ ఫోన్ పెట్టుకున్నాను, పాడైపోయింది కానీ కనిపించడానికి పనిచేసేలా ఉంటుంది. “సెక్యూరిటీ కెమెరా లైవ్ ఫీడ్” అని ఒక స్టిక్కర్ అంటించి కౌంటర్ మీద పెట్టాను. అసలు కెమెరా ఎలాగూ ఉంది, కానీ రెండోది కనిపిస్తే దొంగలు ఇంకా జాగ్రత్తగా ఉంటారు అని నా లాజిక్.
రెండోది – క్యాష్ రిజిస్టర్‌లో ఎప్పుడూ యాభై పౌండ్ల కంటే ఎక్కువ పెట్టను. మిగతా డబ్బు అంతా వెనుక స్టోర్‌రూమ్‌లో ఒక పాత పెయింట్ టిన్ లో దాచేవాడిని. ఎవరైనా వచ్చి “డబ్బు ఇవ్వు” అంటే, రిజిస్టర్ ఖాళీ చేసి ఇచ్చేయొచ్చు, నష్టం తక్కువ.”యాభై పౌండ్ల కోసం నా ప్రాణం రిస్క్ చేయను నేను. కానీ ఆ వెనుక టిన్ లో ఉన్న డబ్బు కోసం మాత్రం ఆలోచించాల్సిందే” అని ఒకసారి బల్జీత్ తో అన్నప్పుడు,
వాడు నవ్వుతూ “నీకు ప్రాణం కంటే డబ్బు ఎక్కువన్నమాట” అన్నాడు.
“అలా కాదు బ్రో. ప్రాణం ఒక్కటే ఉంటుంది, తీసిపారేస్తే మళ్ళీ రాదు. ఒప్పుకుంటాను డబ్బు… జాగ్రత్తగా ఉంటే మిగుల్చుకోవచ్చు కదా.”
మూడోది- పక్క షాప్ లో పనిచేసే మరో ఇండియన్ కుర్రాడు, రవితో ఒక code word సెట్ చేసుకున్నాను. ఏదైనా ఇబ్బంది వస్తే, ఫోన్ చేసి “అన్నయ్య, పాలు అయిపోయాయి, తీసుకురా” అని చెప్తే, అది పోలీసులకి కాల్ చేయమని సిగ్నల్. నేరుగా “police” అని చెప్తే ఎవరైనా వింటే ప్రమాదం అని.
రవి మొదట్లో నవ్వాడు – “నీకు ఇంత paranoid (అతి భయం) తనం అవసరమా బ్రో” అని.
కానీ నేను ఆ న్యూస్ ఫోటో చూపించాక, వాడు మారాడు. “సరే, కానీ నాకు కూడా ఒక కోడ్ వర్డ్ కావాలి, నాకు కూడా ఎవరైనా ఇబ్బంది పెడితే.
“ఇలా, ఒక్కో చిన్న జాగ్రత్త, ఒక్కో చిన్న trick బయటకి చూస్తే నా paranoia (అతి అనుమానం) లా అనిపించొచ్చు, కానీ లోపల నాకు తెలుసు, ఇది భయం కాదు. ఇది ప్రిపరేషన్.ఆ రాత్రి, యథావిధిగా షిఫ్ట్‌కి వెళ్తూ, జేబులో ఫోన్ చెక్ చేసుకున్నాను. రవి నంబర్ సేవ్ అయ్యిందో లేదో మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటూ వెళ్ళాను.
రాత్రి రెండు గంటలప్పుడు, హావ్‌లాక్ రోడ్ మీద ట్రాఫిక్ దాదాపు ఆగిపోయింది. కౌంటర్ వెనుక కూర్చుని, స్టాక్ లిస్ట్ చెక్ చేసుకుంటున్నాను, రేడియో మెల్లగా వాగుతోంది.డోర్ బెల్ మోగింది.
ఇద్దరు మనుషులు లోపలికి వచ్చారు. హుడీలు, ముఖాలు సగం కప్పేసి. కాస్త అనుమానంగా అనిపించారు. ఒకడు కౌంటర్ దగ్గరికి నేరుగా వచ్చాడు, ఇంకొకడు తలుపు దగ్గర నిలబడ్డాడు.గుండె వేగం పెరిగింది, కానీ ఆశ్చర్యంగా, చేతులు వణకలేదు. మూడు వారాల practice లో నేర్చుకున్నది ఒక్కటే – panic అయితే ఓడిపోతావు, calm గా ఉంటే ఆలోచించగలవు. అని.
“కౌంటర్ ఓపెన్ చెయ్. ఇప్పుడే.” కౌంటర్ దగ్గరున్నవాడు అన్నాడు, గొంతులో బెదిరింపు.
” ఎవరు మీరు” అని కాస్త గట్టిగా అన్నాను.
” డోంట్ షౌట్ , అరిస్తే ప్రాణం తీస్తా! కౌంటర్ ఓపెన్ చేయి” అంటూ వాడు.
“సరే, సరే. ప్రాబ్లం లేదు.” చేతులు పైకి లేపుతూ, నెమ్మదిగా అన్నాను. లోపల మాత్రం, కౌంటర్ కింద ఉన్న బటన్ మీద నా కాలు వేలు మెల్లగా నొక్కాను. సైలెంట్ అలారం, పోలీసులకి డైరెక్ట్ సిగ్నల్ వెళ్తుంది.ఒక చేయి దించి కౌంటర్ తీశాను. యాభై పౌండ్ల కంటే తక్కువే ఉంది లోపల.”ఇంతేనా? ఇంకా మిగిలిన డబ్బు ఎక్కడుంది? కామన్ ఫాస్ట్ గా చెప్పు! లేదా ఐ విల్ కిల్ యూ.” వాడి గొంతులో కోపం.
“ఇదే బాస్. చిన్న షాప్, ఎక్కువ డబ్బు పెట్టం.” నా గొంతు స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించాను. వెనుక పెయింట్ టిన్ లో ఉన్న డబ్బు గురించి వాడికి తెలియకూడదు.వాడు నమ్మలేదు అనుకుంటా, కౌంటర్ పైకి ఎక్కి, నా చొక్కా పట్టుకున్నాడు.ఆ క్షణం – mat మీద ఆ అమ్మాయి నన్ను పట్టిన పట్టు గుర్తొచ్చింది. నా చెయ్యి రిఫ్లెక్స్ లా కదిలింది, వాడి చేతిని పట్టుకుని, కాంటే మీద నేర్చుకున్న ఒక simple wrist lock లో బిగించాను.పెద్ద ఫైట్ కాదు, కానీ నా పట్టు లో బిగుసుకుపోయాడు . అచ్చం ఆ అమ్మాయి చేతిలో నాలాగా, అరుస్తూ నానుండి విడిపించుకున్నాడు.అదే క్షణం, తలుపు దగ్గర ఉన్నవాడు ముందుకి వచ్చాడు, కానీ నేను అప్పటికే ఫోన్ చేతిలో పట్టుకున్నాను, రవి నంబర్‌కి కాల్ కలిపాను. స్పీకర్ ఆన్ చేసి కౌంటర్ మీద పడేశాను.”అన్నయ్యా… పాలు అయిపోయాయి, తీసుకురా, తొందరగా!” నా గొంతు వణుకుతోంది, కానీ మాటలు స్పష్టంగా వచ్చాయి.రవికి అర్థమైంది. ఫోన్ అవతల “వస్తున్నా!” అని అరుపు వినిపించింది.
ఇద్దరు దొంగలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏదో తేడాగా ఉందని అనుమానం వచ్చినట్టు. దూరంగా సైరన్ శబ్దం మెల్లగా వినిపించడం మొదలైంది.”పోదాం పద!” అని ఒకడు అరిచాడు, ఇద్దరూ షాప్ నుండి పరిగెత్తారు.
నేను కౌంటర్ వెనుక కూలబడిపోయాను, చేతులు వణుకుతూ, గుండె గుభేల్‌మంటూ. కానీ లోపల ఏదో తెలియని satisfaction.రెండు నిమిషాల్లో పోలీస్ కారు వచ్చింది, తర్వాత మరో రెండు. వాళ్ళు షాప్ బయటే, పరిగెత్తిన దొంగల్ని ఎక్కువ దూరం వెళ్ళకముందే పట్టుకున్నారు. ఒకడు ఇంకా మణికట్టు పట్టుకుని నొప్పితో మూలుగుతున్నాడు.
ఆఫీసర్ లోపలికి వచ్చి, “You did good, mate. Called it in fast, gave us the exact description” అన్నాడు.”
థాంక్స్.” అంతే చెప్పగలిగాను నేను.తెల్లారి, రూమ్‌కి వచ్చేసరికి బల్జీత్ ఇంకా నిద్రలేవలేదు. కానీ నా అలికిడికి లేచి కూర్చున్నాడు.”ఏమైంది? మొహం ఎందుకు అలా ఉంది?”అంతా చెప్పాను, మొదటి నుండి చివరి వరకు. వాడు మొదట షాక్ అయ్యి, తర్వాత నవ్వాడు.
“చూశావా? చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్ స్పెండింగ్ కాదు, అసెట్ అని.”
“అవును బ్రో. కానీ ఇప్పుడు నాకు ఒక డౌట్.”
“ఏంటి?””యాభై పౌండ్లకి బదులు, వందేసి కడితే, ఇంకా బెటర్ మూవ్స్ నేర్పిస్తారేమో అడుగు.” అంటూ నవ్వాను.
బల్జీత్ నవ్వుతూ తలగడ నా మీదకి విసిరాడు. “నీ jipri(పిసినారి) తనం ఇప్పటికీ పోయింది.
“కిటికీ బయట, సౌతాల్ మీద తెల్లవారుతోంది, ఎప్పటిలానే.