జావెలిన్ చేతిలో పట్టుకున్నప్పుడు నా మనసు ఎప్పుడూ ఖాలీగా, లక్ష్యంపై పూర్తి ఏకాగ్రతతో ఉంటుంది. కానీ ఆ రోజు, నాకు పక్కనే ఉన్న స్విమ్మింగ్ వైపు నుండి వచ్చిన ఆ కేక విన్నప్పుడు – నా మనసు మొదటిసారి ఏకాగ్రత తప్పింది.”
Gold! Another gold for her!”అనౌన్సర్ గొంతు గాల్లో మారుమోగింది.
నేను తలతిప్పి చూశాను. దూరంగా, పూల్ లో నుండి బయటికి వస్తూ, తడి ఒంటితో, ఒక చేత్తో వీల్‌చైర్ ని పట్టుకుంటూ ఆమె. చుట్టూ కెమెరాలు, ఫ్లాష్‌లు.
ఆమెను నేను ఇంతకుముందు చూశాను – మ్యాగజైన్ కవర్ మీద, న్యూస్ ఛానల్స్‌లో. “Inspiration”, “Warrior”, “Champion” – ఇలాంటి పదాలతో ఆమెను వర్ణించేవాళ్ళు. కానీ ఆ ఫోటోల్లో ఉన్న నవ్వు, ఇప్పుడు ఇక్కడ లైవ్‌గా చూసినప్పుడు లేదు. అలసట, ఏదో లోతైన శూన్యం – కళ్ళలో కనిపించింది.
అదే క్షణం, నా గుండె పాత సంకేతాలు గుర్తుచేసుకుంటుంది.
ఐదు సంవత్సరాల క్రితం నా ప్రేయసి లాంటి ఆ కళ్ళు, ఆ నవ్వు. అచ్చం ఆమెలాగే ఈమెను చూస్తుంటే ఆమెనే చూస్తున్నట్టు ఉంది. తను ఎప్పుడూ నా పక్కనే ఉండేది, ప్రతి పోటీకి ముందు నా చేయి పట్టుకుని “గెలుపు నీదే” అనేది. ఒక బైక్ యాక్సిడెంట్ లో నేను నా రెండు కాలు కోల్పోయాను. కోమాలోకి వెళ్ళాను. ఎప్పుడూ నా పక్కనే ఉండే తను ఆరు మాసాల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే లేదు. ఎందుకు వెళ్ళిపోయిందో నాకు ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. బహుశా నా కొత్త జీవితాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయిందేమో. తన కోసం ఎంతో వెతికాను, ఎందరినో అడిగాను. బహుశా తనకి కూడా భయమేమో.
నేను గెలిస్తే విష్ చేయడానికైనా తను వస్తుందని నా ఈ ప్రయత్నం.ఇప్పుడు, ఈ కొత్త మొహంలో ఆ పాత కళ్ళు కనిపిస్తున్నాయి.
ఆ రోజు రాత్రి, అథ్లెట్స్ విలేజ్ కేఫటేరియాలో ఆమెను రెండో సారి చూశాను. దూరం నుండి చందమామను చూస్తున్నట్టు ఉంది నాకు. తన కోచ్‌తో మాట్లాడుతూ, ఒక అరటిపండు తింటూ ఉంది. చాలా మామూలు మనుషులాగా. టీవీలో కనిపించే “ఛాంపియన్” కాదు ఇక్కడ – సాధారణ స్త్రీ లాగా.
నేను తెలుసుకున్నాను – తను మారేడ్. తనపై రాసిన ఒక ఆర్టికల్ లో చదివాను. ఆమె గురించి మరింత తెలుసుకుంటుంటే నాకే తెలియకుండా ఆమెపై ప్రేమ పెరుగుతుంది. “ప్రేమ పుట్టడానికి ఒక సెకండ్ చాలు” అని ఏ మహానుభావుడు చెప్పాడో కానీ ఆమెను చూసిన కొన్ని సెకండ్లకే నాలో ప్రేమ పుట్టింది. కానీ “నా ప్రేమ చెప్పడానికి ఆమె ఇప్పుడు సింగిల్ కాదు. మరొకరి భార్య.”
ఈ ఒక్క వాక్యం నా మనసులో మళ్ళీ మళ్ళీ తిరిగింది. నేను ప్రేమను తెలపడం ఆపేసుకున్నాను. అంతే. ఇక్కడితో ఆపేసుకోవాలి అనుకున్నాను. ఆదిలో చిగురించి ఆదిలోనే అంతం చేశాను నా ప్రేమను.కానీ మనసు ఆగదు కదా. అది మెదడు చెప్పే ఆజ్ఞలు అసలు వినదు.
రోజులు గడిచాయి. నేను నా ఈవెంట్ కోసం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను, తనని దూరం నుండి గమనిస్తూనే ఉన్నాను. కేఫటేరియాలో ఒక చిన్న నవ్వు, ఒక చూపు. అందుకోవాలని ఆశగా ఉన్న అందుకోలేని అడ్డుగోడ నా ముందుంది.
ఇలా నాలో ప్రేమ నీటి బుడగలాగా పుడుతుంది.
నా జావెలిన్ ఈవెంట్ రోజు వచ్చింది. మొదటి రెండు త్రోలు మనసు ఏకాగ్రత తప్పి తడబడ్డాయి. మూడో త్రో కి సిద్ధం అవుతున్నప్పుడు, స్టాండ్స్ లో ఒక మూలగా ఆమెను చూశాను – తన స్విమ్మింగ్ హీట్స్ మధ్య ఖాలీ టైమ్‌లో వచ్చి కూర్చుంది.
ఆ చూపు నాలో ఏదో కొత్త శక్తి పోసింది.కాలు నొక్కుకుంటూ, శరీరం అంతా ఏకం చేసి, గట్టిగా ఊపిరి పీల్చుకుని విసిరాను. జావెలిన్ గాల్లో సాగి, పోడియం దూరాన్ని దాటి పడింది. స్టేడియం మొత్తం అరిచింది. నా పేరు స్కోర్ బోర్డ్ మీద మొదటి స్థానంలో మెరిసింది. గోల్డ్.ఫలితం ప్రకటించాక, స్టాండ్స్ వైపు చూశాను.
ఆమె లేచి నిలబడి చప్పట్లు కొడుతోంది. ఆ నవ్వు ముఖంలో నిజమైన సంతోషం స్పష్టంగా కనిపించింది – మ్యాగజైన్ కవర్ మీద కనిపించే నవ్వు కాదు అది, నిజమైనది. ఒక్క క్షణం మా చూపులు కలిశాయి. తను నాకోసం చప్పట్లు కొడుతుంది అనే ఆలోచనే నా గుండెల్ని పూర్తిగా ఆవరించింది.
ఆ రాత్రి, క్లోజింగ్ వీక్ సందర్భంగా అథ్లెట్స్ కోసం ఏర్పాటు చేసిన పార్టీ. లైట్లు మ్యూజిక్ మధ్య, అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను ఒక మూలగా కూర్చుని డ్రింక్ పట్టుకుని ఉండగా, తను నా పక్కకు వచ్చి కూర్చుంది.
“Congratulations on your gold,” అంది, నవ్వుతూ.”Thank you. మీది కూడా,” అన్నాను.మాటలు మొదలయ్యాయి. ఆటల గురించి, ప్రాక్టీస్ కష్టాల గురించి, ఇద్దరి injury స్టోరీల గురించి. డ్రింక్స్ మెల్లగా మనం కట్టుకున్న గోడల్ని కరిగించాయి. మాటల మధ్యలో, తనే అడిగింది – “మీ కళ్ళలో ఎప్పుడూ ఏదో దూరం కనిపిస్తుంది. ఎందుకు?”
ఆ ప్రశ్న నా గుండెని తట్టింది. నేను నా past గురించి చెప్పడం మొదలుపెట్టాను – యాక్సిడెంట్, కోమా, ఆరు మాసాల తర్వాత ఆమె లేకపోవడం. చెప్తూ చెప్తూ, నా గొంతు వణికింది. “మీ కళ్ళు చూసినప్పుడు… ఆమె కళ్ళే గుర్తొచ్చాయి. మొదటి సారి మిమ్మల్ని చూసినప్పుడు, నేను మిమ్మల్ని చూడలేదు, ఆమెనే చూశాను అనిపించింది.”
తను నిశ్శబ్దంగా విన్నది. ఏమీ మాట్లాడలేదు. కళ్ళలో ఆశ్చర్యం, జాలి, మరియు ఏదో వెచ్చదనం కలగలిసిన భావం.”నాకు తెలుసు మీరు మారేడ్ అని,”
నేను కంటిన్యూ చేశాను, గొంతు తగ్గించి. “నేను ఏమీ ఆశించడం లేదు. కానీ ఇది చెప్పకుండా ఉండలేకపోయాను. మీరు నా దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టినప్పుడు, జీవితంలో మొదటిసారి నేను తిరిగి బతికినట్టు అనిపించింది.”
తను కళ్ళు దించుకుంది. చాలా సేపు మౌనం. ఆ మౌనంలోనే నాకు అర్థమైంది – తనకి కూడా ఏదో అనిపిస్తుందని, కానీ చెప్పలేని పరిస్థితి తనది. “నాకు ఇది వినడం… కష్టంగా ఉంది,” అంది మెల్లగా.
“నేను ఏమీ చెప్పలేను మీకు. నా జీవితం ఇప్పటికే నిర్ణయమైపోయింది.”తను లేచి, ఒక్క క్షణం నా వైపు చూసి, మెల్లగా వెళ్ళిపోయింది. వెళ్ళేముందు తన కళ్ళలో కనిపించిన ఆ చివరి చూపు – అది confirmation. తనకి అర్థమైంది. కానీ మార్చలేని satyam ముందు ఇద్దరమూ ఆగిపోయాము.
Type your paragraph here
మూడు రోజుల తర్వాత, ఆమె ఫైనల్ మ్యాచ్ రోజు వచ్చింది.రేసు మొదలైంది. వంద మీటర్ల దూరం – ఆమె తన చేతులతో నీటిని పక్కకు నెట్టుకుంటూ చాలా వేగంగా ఈదుకుంటూ ముందుకు వెళ్ళింది. చివరి ఇరవై మీటర్లలో తను అందరికంటే ముందుకు వెళ్ళింది. ఫినిష్ లైన్ టచ్ చేసిన క్షణం – స్టేడియం మొత్తం అరిచింది.ఆమె గెలిచింది.
ఆఖరి గోల్డ్.నేను ఆమె దగ్గరకు వెళ్లాలనుకున్నాను. కానీ అక్కడొక పెద్ద జాతరలా ఉంది. మీడియా వాళ్ళు, కెమెరామెన్లు, కోచ్‌లు, టీమ్ మేట్స్, ఫ్యాన్స్… ఇలా ప్రతి ఒక్కరూ ఆమెను ఒక గోడలా కమ్మేశారు. ఒక్కసారిగా మైకులన్నీ ముందుకు వచ్చాయి. ఫ్లాష్ లైట్ల వెలుతురులో ఆమె చుట్టూ ఉన్న కోలాహలం స్పష్టంగా కనిపించింది.నేను ఆ గుంపు అంచున నిలబడి ఉన్నాను. దగ్గరికి వెళ్ళడానికి దారి లేదు.కానీ ఆమె చూసింది. గుంపు మధ్యలో నుండి, తన కళ్ళు నా వైపు తిరిగాయి.
నేను నోటితో మాత్రమే అన్నాను, చేయి ముందుకు చాచలేకపోయాను – “Congratulations.”అంతే. చేయి కలపలేదు. దూరం తగ్గలేదు. మధ్యలో ప్రెస్, కోచ్‌లు, ఆమె జీవితంలో భాగమైన మనుషులు – వాళ్ళందరూ ఒక అడ్డుగోడలా నిలబడ్డారు, పార్టీ రాత్రి మాటల్లో దాటిన గోడ, ఇప్పుడు తిరిగి నిజ జీవితంలో నిలబడింది.ఆమె తలవంచి ఒక్క క్షణం నా వైపు చూసింది. ఏమీ చెప్పలేని ఆ చూపులోనే అన్నీ చెప్పబడ్డాయి. ఆ తర్వాత గుంపు తనని మళ్ళీ లోపలికి తీసుకుపోయింది. ఇంటర్వ్యూలు, ఫోటోలు, సెలబ్రేషన్.నేను వెనక్కి తిరిగాను.
మూడు రోజుల తర్వాత, క్లోజింగ్ సెరిమనీలో, దూరం నుండి ఆమెను ఒకసారి చూశాను. తన భర్త పక్కనే నిలబడి ఉంది, నవ్వుతూ. ఆ నవ్వు నిజమో, అలవాటుగా వేసుకున్న ముసుగో నాకు తెలియదు.తను కూడా నా వైపు ఒకసారి చూసింది. ఒక్క క్షణం. ఆ తర్వాత తలతిప్పుకుంది.ఎయిర్‌పోర్ట్‌లో, వేర్వేరు గేట్ల వైపు నడుస్తూ, ఇద్దరి దేశాలు వేరు, ఇద్దరి ఆటలు వేరు, ఇద్దరి జీవితాలు వేరు – అని గుర్తుచేసుకున్నాను.
కీర్కేగార్డ్ ఒక చోట అంటాడు – నిజమైన బాధని మాటల్లో చెప్పలేమని, అది లోపలే ఉండిపోతుందని. కానీ ఆ రాత్రి పార్టీలో నేను మాటల్లో చెప్పాను. ఆమెకి అర్థమైంది. అయినా మౌనమే మిగిలింది – ఎందుకంటే కొన్ని సత్యాలు చెప్పినా, మార్చలేని పరిస్థితుల ముందు మాటలు కూడా నిస్సహాయమైపోతాయి.
నేను ఇప్పటికీ జావెలిన్ ఎత్తుకుంటాను. ప్రతిసారి, గాల్లోకి దాన్ని విసిరేటప్పుడు, ఒక్క క్షణం ఆ రాత్రి పార్టీలో ఆమె కళ్ళలో కనిపించిన ఆ చివరి చూపు గుర్తొస్తుంది.చెప్పిన ప్రేమ కూడా కొన్నిసార్లు మౌనంగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ప్రేమని అర్థం చేసుకోవడం వేరు, దాన్ని జీవించడం వేరు.కొన్ని ప్రేమలు గెలవడానికి పుట్టవు. మౌనంగా జీవించడానికే పుడతాయి.
Leave a Reply