కాలేజీ ప్రేమ – ఆరంభం

Written by

in

Writer ✍️: Krishna Perla

కథ ఆరంభం

నేను, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డిగ్రీ కాలేజ్ లో B.sc data science 2nd year చదువుతున్న.

నేను రహీమ్ ఇద్దరం కాలేజీ క్యాంటీన్ లో   ఎదురు ఎదురుగా కూర్చున్నాము. కోక్స్ తాగుతున్నాము. రహీమ్ నాతో ఇలా అన్నాడు.

” మామా, దేకో “

“ఏంటి”

” ఏక్ లడికి వస్తుంది. బహుత్ అచ్చి హై! ”

వెనక్కి తిరిగి చూసా! అంతే ఫ్లాట్ నేను.” గార్జియస్ రా రహీమ్.”

బ్లూ డ్రెస్ లో తను మా పక్క నుండి వెళ్తున్నపుడు పొద్దు తిరుగుడు పువ్వులా మా ఫేస్ లు  ఆమె నడక వైపే తిరిగాయి.

” హెల్ప్ కరో మామా! మై ప్యార్ మే పడ్ గయా! లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా! “

” రేయ్, నాకు కూడా నచ్చింది రహీమ్! “

” నీకు  పడతారు! మేరే బస్ కి నహి ఐ మామా! ప్లీజ్ హెల్ప్ కరో.”

“ఓకే పదా, ఇప్పుడే పరిచయం చేస్తా! ”

” మామ, నహి. వెయిట్ కరో. జస్ట్ వాచ్ చేద్దాం.”

మా మాటలు విన్న అఖిల్, వెంటనే  లేచి ఇలా అన్నాడు.”రహీమ్, లవ్ చేస్తే చెప్పాలి! లేదా లవ్ చేకూడదు. Come on.. May I help you. “

” నహి. డర్ లగ్  రహ ఐ అఖిల్.  “

“రేయ్, మనం సెకండ్ ఇయర్ ఇప్పుడు. సీనియర్స్. No one can’t stop us. Okay! Let’s go man. Express  your beautiful  first sight love.”

” అఖిల్, రహీమ్  వద్దునప్పుడు వద్దులే! “

” You fear students. మీ వల్ల కాకపోతే చెప్పండి. నేను ట్రై చేసి పడగొడతా. ”

” కామెడీ చేయకు అఖిల్. ఆ పిల్లని రహీమ్ లవ్ చేస్తున్నాడు. నువ్వు సైడ్ అవ్వడం నీకు మంచిది. “

” నేను సైడ్ అవ్వాలా? నాన్సెన్స్.. ఈ సీన్ ని express చేయడానికి తెలుగులో ఒక లైన్ ఉంటుంది. హా .. i remember that. మింగలేక మంగళారం అన్నాడు అంట ఎవడో! అంతేకదా? Am I correct? ”

” చుప్ అఖిల్. బ్యాంకెలౌడే, మాదర్చోత్. ”

” రేయ్ అఖిల్. దొబ్బే ఇక్కడ నుండి. నువ్వు ఇంకొక మాట అంటే, నీ భాషలో ఒక మాట చెబుతా. Dogs bite.. slipper slap. “

మా వార్నింగ్ కి బయపడ్డాడో లేదో తెలియదుగానీ అక్కడ నుండి వెళ్ళిపోయి మాకు పెద్ద షాక్ ఇచ్చాడు వాడు.

వాడు నేరుగా ఆ అమ్మాయి పక్కకి వెళ్ళి కూర్చొని, తన భుజంపై చేయి వేసి.. మా వైపు కోపంగా చూస్తూ తన బుగ్గపై ముద్దు పెట్టాడు. ఇక అంతే మాకు షాక్.

” రేయ్ రహీమ్. ఏంటిరా వాడు ఆ అమ్మాయికి ముద్దు పెట్టాడు. ” మా ఇద్దరిని వైపు ‘ మీ బతుకులు అంతే ‘ అన్నట్టు చూసాడు.

” వీడిని ఎలాగైనా కూట్నా పడ్తది మామా! నేను కర్చీఫ్ వేసి సీట్ రిజర్వ్ చేసుకున్నా… వాడు ఆ సీట్‌లో వచ్చి కూర్చున్నాడు! “

” మామా, మనం పొరబడుతున్నాము. అసలు ఆ సీటే వాడిది. నువ్వే తెలియక కర్చీఫ్ వేశావు. వదిలే.. అడివిలో ఆకులు కరువ, కాలేజీ లో అమ్మాయిలు కరువ? చెప్పు!”

” చోడ్దొ నహి మామా! నాకు దక్కనిది వాడికి దక్కకూడదు రా మామా… యేన్ హువా అయినా! “

“సరే మామ” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాము.



ఆగస్టు నాలుగున, మా కాలేజీలో FRESHERS MEET & GREAT – MILAN ఏర్పాటు చేశారు. అప్పటివరకు సీనియర్స్ యూనిఫాంలో, ఫ్రెషర్స్ సివిల్ డ్రెస్ లో కందిరీగలు, కాక్రోచ్ లా ఉండే అమ్మాయిలు కాస్త ఆరోజు మాత్రం రంగురంగు సీతాకోకచిలకలా తయారై వచ్చారు.

మా అబ్బాయిలు కూడా దోమలాగ అప్పుడప్పుడు కాలేజీకి వచ్చేవారు కాస్త ఆరోజు ఈగలగా వాలిపోయారు. అయినా కానీ ఆ సీతాకోకలు ముందు మేము తేలిపోయాము.

“ ఏం కలర్ రా మామా… క్యా బ్యూటీ హై! మిస్ యూనివర్స్ పోటీలు చూస్తున్నట్టుంది! ”

” అవును రహీమ్! కానీ ఇక్కడే గేట్ దగ్గరే ఇలా చూస్తుంటే హచ్చు కుక్కల్లా తీసిపారేస్తారు మనలని. “

” అయితే అబ్  క్యా కర్తె? చెప్పు! “

” మనం స్టేజ్ ముందుండే చైర్స్ లో రాయల్ గా కూర్చుని చూస్తుంటే.. మన ముందు అమ్మాయిలు వెళ్తుంటే, అప్పుడు అది మిస్ యూనివర్స్ పోటీలా జరుగుతున్నట్టు ఉంటుంది. మనం కూడా ఎవరికో ఒకరికి ఎక్కువ మార్క్స్ వేసి సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు! ఏమంటావు? ”

” మామా… వో మార్క్స్ ఏదో ఇక్కడే వేద్దాం! ”

ఇంతలో యమహా ఎఫ్.జెడ్ బ్లూ కలర్ బైక్ పై అఖిల్ గాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి మా ముందు బ్రేక్ వేశాడు.

అంతవరకు అఖిల్ గాడు నాకు,రహీమ్ కు క్లాస్మేట్ మాత్రమే! కానీ ఆ తర్వాతే వాడు మాకు శత్రువు అయ్యాడు. ఇది పక్కన పెడితే హాఫ్ శారీలో ఆ అమ్మాయి బైక్ మీద నుండి దిగుతుంటే యువరాణిలా అనిపించింది మాకు.

అది చూసి తట్టుకోలేని రహీమ్ అక్కడి నుండి పోదామని నా చేయి పట్టుకొని స్టేజ్ ముందుకు తీసుకెళ్లాడు. ఆ స్టేజ్ ముందు నుంచున్న నాకు, మైక్ లో ఒక గొంతు వినిపించింది.

” హలో చెక్, హలో చెక్. గుడ్, ఆల్ డన్ బ్రదర్ ” అంటూ ఒక అమ్మాయి డీజే సౌండ్ బ్రదర్ కు చెబుతుంటే ఆమెను చూసి నా గుండె జారి గల్లంతయింది.

ఇక వేరే అమ్మాయిలను చూడకుండానే ఆ అమ్మాయికి 100 మార్కులు వేశా, ఈ పిల్లనే పడగొట్టాలని ఫిక్స్ అయ్యా!

” గ్రీన్ శారీ 60, టాల్ కుసుమ 78, చబ్బీ చంద్రిక 93, ఫాతిమా  94,  శాహనా 96, ఫరీదా 97, బ్యూటీ బేగం 98, ఫైనల్ యాంకర్ రోసి సౌ మే సౌ మామా! ”

రహీమ్ ఏదో లెక్కలు వేసుకుంటున్నాడని అర్థమవుతుంది కానీ నా మనసు, కళ్ళు అంతా ఆమె వైపే. మా కాలేజీలో పొద్దుతిరుగుడు పువ్వుకి పోటీగా రోజా పువ్వు వచ్చిందని నాకు అనిపించింది.

కానీ మా రహీమ్ గాడు 100 మార్కులు ఎవరికి ఇచ్చాడో  తెలుసుకోవడానికి వాడివైపు చూసా!” మామా, ఫిక్స్ కరో.  యాంకర్ రోసి సౌ మే సౌ మార్క్స్. ముఝే లగ్తా హై, నేను ఆ లడీకితో ప్యార్ లో పడిపోతున్నా! ”

” ఎవరు మామా! నీ చేత 100 మార్కులు పొంది , నీ మనసు దోచుకున్న పిల్ల? ”

” యాంకర్ రోసి, 2nd year B.sc AI & Ml గ్రూప్. ” అంటూ స్టేజీపై ఉండే మైక్ పట్టుకొని మాట్లాడుతున్న పిల్ల వైపు చూపించాడు.

” యాంకర్ నా?  అరే మామా, అది నా పిల్ల రా! “




పార్ట్ 1 ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *