లవ్ – ఫిలాసఫీ

Written by

in

నీవు నమ్మకంగా ఉంటావా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.

నీవు గౌరవంగా నడుచుకుంటావా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.

నీవు డబ్బుకంటే మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తావా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.

నీవు తల్లిదండ్రులు మాట వింటావా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.

నీవు బాడీ వర్కౌట్ చేయవా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.

నీవు అధికారం చూపలేవా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.

నీవు స్వార్థం లేకుండా జీవిస్తున్నావా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.

నీవు మోసం చేయడానికి భయపడతావా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.

నీవు సింపుల్ లైఫ్ కోరుకుంటావా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.

ప్రతి చిన్న విషయానికి నిన్ను నీవు నిందించుకుంటావా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.

నీవు ఒంటరిగా బతికే ధైర్యం లేదా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.


ఈ లక్షణాలు అన్ని నీలో ఉంటే బయట సమాజంలో నువ్వొక గుడ్ పర్సన్. కానీ వాళ్ళ అంతర్గత భావాలలో మాత్రం నువ్వొక చేతకాని దద్దమవి.

రివెంజ్ లవ్: ఇందులో నువ్వు మోసం చేయాలి, స్వార్థంతో బ్రతకాలి, మర్యాద లేకుండా ఎప్పుడూ కోపంగా ఉండాలి,ఏమి చేసైనా ప్రేమించిన మనిషిని ఇబ్బంది పెట్టీ సంతోషంగా బ్రతకాలి.

ప్రేమకి ఒక్కప్పుడు అర్థం ప్రేమ ఇవ్వడం. కానీ ఇప్పుడు ప్రేమ కోరడం.

నేను నీకోసం ఏదైనా చేస్తాను అన్న దగ్గరనుండి నాకోసం నువ్వు ఏది ఎందుకు చెయ్యవు? అనేవారుకు వచ్చేసింది.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *