మృత్యువు తొడిగిన పూలదండ – భాగం 19

Written by

in

స్థలం: నేషనల్ హైవే – వైజాగ్ అంచులు – తెల్లవారుజామున 6:35 గంటలు.

తెల్లవారుజాము కాస్త చీకటిని కూడా చీల్చుకుంటూ ఆ నల్లటి స్కార్పియో కారు గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో హైవే మీద రయ్యిమంటూ దూసుకెళ్తోంది.

కారు వెనుక సీట్లో రమ్య స్పృహ తప్పి పడి ఉంది. రౌడీలతో జరిగిన పోరాటంలో తగిలిన దెబ్బలకు ఆమె స్పృహ కోల్పోయింది.

కంటి కింద కారుతున్న రక్తాన్ని చేత్తో తుడుచుకుంటూ బన్నీ వాస్ రాక్షసుడిలా రమ్య మీదికి పడ్డాడు. ఆమె రెండు చేతుల పిడికిళ్లు బలవంతంగా విరిచి చూశాడు. అక్కడ పెన్‌డ్రైవ్ లేదు!వాడికి పగ, భయం ఒకేసారి నెత్తికెక్కాయి. పిచ్చివాడిలా రమ్య పక్కన పడి ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ని గుంజి, అందులో ఉన్న ఫైళ్లు, వస్తువులన్నీ కారు ఫ్లోర్ మీద పారబోశాడు. ఎక్కడా దొరకలేదు.

నిస్సహాయ స్థితిలో స్పృహ లేకుండా ఉన్న రమ్యను చూసి, వాడిలో క్రూరత్వం పీక్స్‌కి చేరింది.బన్నీ వాస్ ఏమాత్రం కనికరం లేకుండా ఆమె కట్టుకున్న చీర విప్పేసి, ఆమె శరీరంపై నూలుపోగు లేకుండా అన్ని విప్పేసి, పెన్‌డ్రైవ్ కోసం మరింత పిచ్చిగా వెతికాడు.

కానీ ఆమె దగ్గర అది ఎక్కడా కనిపించలేదు!“ఎక్కడ దాచావే? చెప్పే… ఎక్కడుంది?” అంటూ బన్నీ వాస్ స్పృహలేని రమ్య భుజాలు పట్టుకుని పిచ్చివాడిలా ఊపేశాడు. కానీ రమ్య నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆమె తల నిస్సత్తువగా పక్కకు వాలిపోయింది.

సరిగ్గా అదే సమయంలో… కారు వెనుక అద్దంలోంచి సైరన్ వెలుగులు, దానికి తోడు భయంకరమైన బుల్లెట్లు కాల్పులు వినబడ్డాయి.

కానిస్టేబుల్ శ్రీను తోలుతున్న పోలీస్ జీప్ కళ్లు మూసి తెరిచేలోగా స్కార్పియో కారుకు చేరువగా వచ్చింది! డ్రైవింగ్ సీట్లో ఉన్న శ్రీను స్టీరింగ్‌ను ఒంటిచేతితో బలంగా పట్టుకుని, కుడిచేతిని కిటికీ బయటకు పెట్టి కారు టైర్లను టార్గెట్ చేస్తూ తుపాకీతో వరుసగా కాల్పులు జరిపాడు!

“ధాం! ధాం!” అంటూ శబ్దాలు చేస్తూ, స్పీడ్ కారణంగా గురి తప్పి, బుల్లెట్లు కారు బ్యాక్ బంపర్‌కి తగిలి మెరుపులు చిందాయి.

“ఆపకు రా! ముందు ఏది అడ్డొచ్చినా దూసుకుపో… కానీ వాడికి మాత్రం దొరకొద్దు!” అని బన్నీ వాస్ రక్తం కళ్లతో డ్రైవర్ మీద అరిచాడు.

అప్పటికే పూర్తిగా తెల్లవారింది. హైవే మీద ఒకటొకటిగా కూరగాయల లారీలు, ఆర్టీసీ బస్సులు వస్తూనే ఉన్నాయి. ఆ హెవీ ట్రాఫిక్ మధ్యలో స్కార్పియో కారు, పోలీస్ జీప్ ఒంపులు తిరుగుతూ, వాహనాల మధ్య నుంచి కట్ కొడుతూ దూసుకెళ్తున్నాయి. ఆ రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులకు అది మృత్యువుతో పందెం పడుతున్న F1 రేసులా, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని చావు రేస్‌లా అనిపిస్తోంది.

ఒక ఆర్టీసీ బస్సును రాంగ్ సైడ్‌లో దాటుకుంటూ బన్నీ వాస్ కారు ముందుకు వెళ్లగా… శ్రీను జీప్‌ని డివైడర్ అంచు వరకు తీసుకెళ్లి కారును లాక్ చేస్తూ పక్క నుంచే పారలెల్‌గా వచ్చాడు.

శ్రీను జీప్ నుంచి అరిచాడు.”కారు ఆపరా బన్నీ వాస్! లేదంటే బుల్లెట్ నీ హెడ్ లోకి కాలుస్తా!”

కానీ స్కార్పియో డ్రైవర్ జవాబుగా యాక్సిలరేటర్‌ను మరింత బలంగా తొక్కేశాడు.సరిగ్గా అదే క్షణంలో… హైవే మలుపు వద్ద లెఫ్ట్ సైడ్ లేన్‌లో వెళ్తున్న ఇండికేటర్ వేస్తూ వేగం తగ్గించిన భారీ ఐరన్ లోడ్ లారీ… సడన్‌గా కుడివైపు ఉన్న కట్‌లోకి తిరిగింది!

కళ్లముందు కొండంత లారీ అడ్డంగా రావడం చూసి స్కార్పియో డ్రైవర్ కంగారులో బ్రేక్ బలంగా తొక్కాడు. కానీ గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంలో ఉన్న ఆ కారు సడన్ బ్రేక్ వేయడంతో టైర్లు స్కిడ్ అయి, కంట్రోల్ తప్పి నేరుగా వెళ్లి ఆ భారీ లోడ్ లారీ వెనుక భాగాన్ని భయంకరమైన శబ్దంతో ఢీకొట్టింది!

“ఢాం!”అని రోడ్డు దద్దరిల్లింది. స్కార్పియో కారు ఇంజన్ ముక్కలై, కారు ముందు భాగం లారీ కిందకి దూసుకెళ్లిపోయింది!కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జై, ఇంజన్ నుంచి దట్టమైన పొగలు ఎగసిపడుతున్నాయి.వెనుకే ఉన్న శ్రీను జీప్‌ని సడన్ బ్రేక్ వేసి ఆపాడు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *