About me

Krishna perla (writer)

కృష్ణ పెర్ల (రచయిత)నా జన్మస్థలం అనకాపల్లి జిల్లాలోని ‘బంగారమ్మపాలెం’ అనే ఒక అందమైన గ్రామం; నా తల్లిదండ్రులు భోగేష్, దుర్గమ్మ. చిన్నప్పటి నుండి సముద్రా తీరాన పెరగడం వల్లో ఏమో… నిరంతరం వచ్చే ఆ సముద్రపు అలల లాగే నాలోనూ ఆలోచనలు ఎప్పుడూ అలజడి సృష్టిస్తూనే ఉండేవి.
టెన్త్ వరకు కాన్వెంట్ లో చదివినా, ఎందుకో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల వాతావరణంపై నాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన మక్కువ ఉండేది. ఆ ఇష్టంతోనే గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో మెకానికల్ బ్రాంచ్ లో డిప్లొమా పూర్తి చేశాను. ఆ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. కానీ, ఆ రోజుల్లో నేను చేసిన ఉద్యోగాలే నన్ను ఒక రచయితగా మార్చాయి. ఎందుకంటే, అక్కడ నేను ఎంతోమంది వేరు వేరు మనుషులను, వారి భిన్నమైన జీవితాలను, భావోద్వేగాలను చాలా దగ్గరగా చూశాను.

అలా మనుషుల సైకాలజీ మరియు ఫిలాసఫీ (తత్వశాస్త్రం) అర్థం చేసుకోవాలనే ఆసక్తి నాలో పెరిగింది. దానికోసం విపరీతంగా పుస్తకాలు చదవడం ప్రారంభించాను. ఆ అధ్యయనమే నా కథలకు ప్రాణం పోసింది. అందుకే నేను రాసే కథలు కేవలం ఊహల్లో కాకుండా… నిఖార్సైన వాస్తవాలు, మనసుల లోతుల్లోని భావాలు మరియు జీవిత తత్వాల (Philosophy) కలబోతగా ఉంటాయి.

నా టాప్ రచనలు:
📖 ప్రేమకి చివరి అల
📖 ప్రేమను డబ్బుతో కొనుక్కోవాలి
📖 మబ్బుల ఆట

• • •

• • •