Elementor #824

Written by

in

టీ దుకాణంలో కబుర్లు


టీ స్టాల్ దగ్గర జరిగే విచిత్రాలు:

సిగరెట్ కాలుస్తూ హెల్త్ గురించి మాట్లాడతారు,

లంచం తీసుకుంటూ నిజాయితీ గురించి మాట్లాడతారు,

ఖాళీగా తిరిగినోడు కలలు గురించి మాట్లాడతాడు,

పదవి లేనివాడు రాజకీయ సలహాలు ఇస్తాడు,

పాకెట్ లో పది రూపాయలు లేనివాడు  ఫారిన్ ట్రిప్పులు గురించి మాట్లాడతాడు,

టీలో షుగర్‌లెస్ అని చెప్పి, కుకీస్ తింటారు,
ఆడవాళ్ళు ఇక్కడ బిల్లు కట్టరు,

అన్నిటికంటే హైలైట్ ఇక్కడ అడుక్కునే వాడు అంబానీలా ఫీల్ అయి డబ్బులిచ్చే టీ తాగుతాడు.


ఈ టీ చేసే మహిమలు:

ఆఫీసులో సైలెంట్ గా ఇక్కడ సింగర్ లాగా మాట్లాడతాడు.

మాటలు రాని మూగవాడు మోనో యాక్షన్ చేస్తాడు.

కళ్ళు లేని గుడ్డివాడు ప్రపంచం గురించి వింటాడు.

ఈ రెండిటిలో ఏది బాగుందో చెప్పండి:
1.ఇక్కడ కబుర్లు ఇంటిలో రహస్యాలు నుండి ఏలియన్స్ అండర్ వేర్ వరకు  వినిపిస్తాయి.
2. ఇంటిలో విషయాలు నుండి ai వరకు అన్ని విషయాలు మాట్లాడారు.

నాకు తెలిసి ఇది టీ దుకాణం కాదు ప్రతి గ్రామంలో ఉండే మినీ bigboss షో!

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *