వ్యాసాలు

” అద్దె భర్త “

శుభలగ్నం సినిమా చూసినదగ్గర నుండి కొందరు మగాళ్ళకు జగపతిలాగే తనని ఎవరైనా కొనుక్కుంటే బాగుండు అనిపించేది. నాకు కూడా కొన్ని సార్లు అలానే అనిపించేది అనుకో! కానీ..

జగపతిలా ఎవరైనా కొనుక్కోవాలంటే అది ప్రేమతో నిండిన ఫాంటసీ. కానీ నిజ జీవితంలో స్త్రీలు ఒక అవసరం కోసం, ఒక ఖాలీతనం కోసం మగాళ్ళని ‘హైర్’ చేసుకునే కాన్సెప్టే — అద్దె భర్త.

ఒకప్పుడు భర్త చనిపోతే భార్యను భర్తతో పాటే దహనం చేసేవారు. ఆ తర్వాత అది కరెక్ట్ కాదనిపించి ఆమెను జీవితాంతం వెధవరాలుగా ఉంచారు. ఇది కూడా కరెక్ట్ కాదనిపించి రెండో పెళ్లి అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు అద్దె భర్త అంటూ మరో కొత్తరకం వచ్చింది.

ఇవన్నీ అవసరమున్న జీవితాల కోసం తీసుకొస్తే, వాటిని ఆసరాగా తీసుకుని అవకాశంగా మార్చుకుని బ్రతుకుతున్నది ఎందరో!

మనుషులకి కావాల్సింది చివరికి ఒక్కటే — స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ కోసం ఒక్కోసారి కట్టుబాట్లని బ్రేక్ చేస్తారు, ఒక్కోసారి కొత్త కట్టుబాటునే క్రియేట్ చేసుకుంటారు. అందుకోసం ఎన్ని దారులు తొక్కడానికైనా సిద్ధపడతారు. ఇక్కడ సిస్టమ్ మారుతుంది, సంప్రదాయాలు మారుతాయి, రూల్స్ మారుతాయి, లా మారుతుంది — కానీ మారని ఒక్కటే, ఉన్నదాంతో తృప్తిపడకుండా ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే మనుషుల మనసు.

ఆఖరికి అనిపిస్తుంది — జగపతిలా కొనుక్కోవాలన్న కోరిక ఒక సినిమా ఫాంటసీ అయితే, అద్దె భర్త అనేది అదే కోరికకి రియల్ లైఫ్ వెర్షన్. తేడా ఒక్కటే — సినిమాలో అది ప్రేమ, ఇక్కడ అది వ్యాపారం.

“అద్దె భర్త” —వాడే ఉద్దేశంతో ఇచ్చాడో? కానీ మీరు ఈ కాన్సెప్ట్‌ని accept చేస్తారా? చేయరా?కామెంట్ చేయండి!